పవన్ కల్యాణ్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ మహిళా విభాగం

వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం సోమవారం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని మహిళా విభాగం నేతలు కోరారు.

ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారన్న పవన్ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తప్పిపోయిన మహిళల వివరాలు ఇవ్వాలని మహిళా కమిషన్ కోరింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: