నంద్యాల జిల్లాలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయప్రతాప్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నేటి బాలలే రేపటికి దేశానికి పట్టుకొమ్మలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులు ఆహార విషయంలో వెనుకంజ వేయకుండా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నంద్యాల జిల్లాలో తనిఖీలలో భాగంగా పాణ్యం మండలం నెరవాడ గ్రామం లోని మహాత్మజ్యోతి బా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమగురుకుల పాఠశాల, బాలికల కళాశాల మరియు గురుకులం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(పీ.టీ.జి- చెంచు గిరి)ను,పాణ్యం మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల,


ఇందిరా నగర్ అంగన్వాడీ సెంటర్ లోని వివిధ రికార్డులను పరిశీలించి,చెంచు కాలనీ లోని చౌక దుకాణం-6 ను, సుగాలిమెట్ట గ్రామం లోని ఎపి మోడల్ స్కూల్,కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం, తమ్మరాజుపల్లె లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,సిమెంట్ నగర్ లోని పాణ్యం సిమెంట్ పాఠశాలను,బేతంచేర్ల మండలంలోని అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేసి వివిధ రికార్డులను పరిశీలించి, చౌక దుకాణం-9ని తనిఖి నిర్వహించి,బేతంచెర్ల మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు బాలురకళాశాల,

డోన్ పట్టణంలోని డా.బిఆర్.అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల,డోన్ పట్టణం లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను డోన్ మండలం ఉడుములపాడు గ్రామం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 
గోదాముల సముదాయాలను,డోన్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును సందర్శించి పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి పాఠశాల వంటశాల గదులను పరిశీలించి

విద్యార్థినులతో పోర్టిఫైడ్ రైస్ యొక్క ఉపయోగం మరియు మెనూ ప్రకారం ఆహారం అందుతుందా లేదా అని ఆహార విషయంలోని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులతో మాట్లాడి తెలుసుకొని పౌష్ఠికాహార సంబంధిత అంశాలు విచారించిన అనంతరం విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు మరియుస్కెల్ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి అందజేశారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: