నైతికవికాసానికి కథలేసోపానాలు

డోన్ పురపాలక సంఘం చైర్మన్ సప్తశైల రాజేశ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

విలువలు తరిగిపోతున్న నేటి ఆధునిక సమాజంలో బాల బాలికలు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడడానికి నైతిక విద్య ఎంతో అవసరమని, నీతి మార్గాన్ని బోధించే రామాయణ,భాగవత ఇతిహాసాలు పురాణాలు చదవడం,వినడం అందరికీ అత్యంత ఆవశ్యకమని డోన్ పురపాలక సంఘం చైర్మన్ సప్తశైల రాజేశ్ తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానము, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ సుధావిద్యాలయ లో జరిగిన"కథ చెబుతారా... ఊ... కొడతాం" కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కథలు, పంచతంత్రం కథలు విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని,  మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు చిన్నతనంలోనే నైతిక విలువలను పెంపొందించుకోవాలని ఫలితంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడ తారని పేర్కొన్నారు.


తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి  మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ విద్యార్థుల సర్వతోముఖ మానసిక వికాసానికై ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వాటిలో కథచెబుతారా..ఊ.. కొడతాం కార్యక్రమం ఒకటని, విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి విలువలుగల పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఎంతో తోడ్పడుతాయని అన్నారు. 10,15 సంవత్సరాల వయసు విద్యార్థుల విభాగంలో జరిగిన పోటీలలో జూనియర్ విభాగంలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాలను షేక్ జిజా మెహక్ అంజుమ్,బి.ప్రణవి, వై.శృతి మరియు సీనియర్ విభాగంలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాలను వరుసగా హేమంత్ నాయక్, డి.ఆయేషా,యు.తేజవర్ధన్ గెలుపొందారు.

ముగింపు కార్యక్రమంలో శ్రీ సుధా విద్యాలయ నిర్వాహకులు రాజ సుధాకర్ గుప్త మాట్లాడుతూ విద్యార్థుల్లో మరింత నైతిక విలువలు పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు వివేకానంద సేవా సమితి,తిరుమల తిరుపతి దేవస్థానము తరఫున ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విజేతలకు 1000/-,750/-, 500/- నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలనుండి 115 మంది విద్యార్థులు పాల్గొన్నారు.కార్యక్రమ న్యాయనిర్ణేతలుగా డాక్టర్ సురేశ్ బాబు,సర్వజ్ఞ మూర్తి,డాక్టర్ దేవేంద్రప్ప, సుబ్రహ్మణ్యం శెట్టి,నీలిమ,సీతామాలక్ష్మి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివేకానంద సేవాసమితి గౌరవ అధ్యక్షులు సప్తశైల తిమ్మయ్య,వ్యవస్థాపకులు జగన్మోహన్,ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ శ్రీనివాసులు శెట్టి, కోశాధికారి పి.వి.రంగయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: