కన్సర్వేషన్ జోన్ నుండి,,,

మహేశ్వరం, కందుకూరు మండలాలను విముక్తి చేయండి

ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా ఏర్పాటు  చేయండి

సీఎం కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కన్సర్వేషన్ జోన్ నుండి మహేశ్వరం, కందుకూరు మండలాలను విముక్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాసారు. ఇటీవలి మహేశ్వరం హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన మంత్రి తాజాగా లేఖ రాసారు. దినదినాభివృద్ది చెందుతున్న ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా ఏర్పాటు చేయాలని కోరారు.


 
ఇటీవలే 111 జీవో ను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. నగరానికి,  ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా ఉన్న ఈ రెండు మండలాల్లో ప్రజల నివాసాలు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా రెసిడెన్షియల్ జోన్ ఆవశ్యకత ఏర్పడుతుందని,  ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: