నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా
ప్రమాణ స్వీకారం చేసిన మల్లెల రాజశేఖర్ గౌడ్
( జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మాజీ ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన మల్లెల రాజశేఖర్ గౌడ్ పదవి ప్రమాణస్వీకారంను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నంద్యాల,పాణ్యం, నందికొట్కూరు,ఆత్మకూరు, ఆళ్లగడ్డ,బనగానపల్లె,డోన్ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల,కార్యకర్తల మరియు అభిమానుల సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు
నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి 7 నియోజకవర్గాల టిడిపి ప్రజాప్రతినిధుల,కార్యకర్తల మరియు అభిమాల మధ్య పదవీ ప్రమాణ శ్రీకారం చేశానని,నేటి నుండి నంద్యాల జిల్లాలోని ప్రజలందరికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల అభ్యున్నతికి తీసుకున్న పథకాలను, ఆశయాలను వివరిస్తూ ప్రజా ప్రతినిధులతో మమేకమై రానున్న ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి తన శాయశక్తుల కృషి చేస్తాననితెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గౌరు చరిత రెడ్డి,భూమా అఖిలప్రియ,కర్నూలు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, ఏన్ఎండి ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, బీసీసెల్ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి చల్లా నాగరాజు,నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల టిడిపి కన్వీనర్లు,మండల, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Home
Unlabelled
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ,,,, ప్రమాణ స్వీకారం చేసిన మల్లెల రాజశేఖర్ గౌడ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: