అత్తింటి వారిపై ఆమె పుట్టింటి వారి దాడి
యూపీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకొంది. గర్భిణికి ఆసుపత్రిలో ఏసీ గది ఏర్పాటు చేయలేదంటూ అత్తింటి వారిపై ఆమె పుట్టింటి వారు దాడికి తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఇటీవల ఓ గర్భిణిని ఆమె అత్తింటి వారు బారాబంకీ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను చూసేందుకు వచ్చిన పుట్టింటి వారు మహిళ ఏసీ లేని గదిలోనే ప్రసవించిందని తెలుసుకుని అత్తింటి వారితో గొడవకు దిగారు. ఏసీ గది ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ గర్భిణి తల్లిదండ్రులు తమ వియ్యంకుడు రాజ్‌కుమార్‌తో గొడవపడ్డారు. చివరకు ఆయనపై చేయి చేసుకున్నారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు విచారణ జరుపుతున్నారు.
Home
Unlabelled
అత్తింటి వారిపై ఆమె పుట్టింటి వారి దాడి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: