పాఠశాల సముదాయ శిక్షణ తరగతులు ప్రారంభం
ఎంఈఓ విమల వసుందర దేవి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం గడివేముల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న నాలుగు పాఠశాల సముదాయాల యందు రెండు రోజులు పాటు విద్యార్థులకు బోధించే శిక్షణా తరగతులపై శిక్షణ ఇస్తున్నట్లు ఎంఈఓ విమల సుందర దేవి తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడివేముల యందు 50 శాతం మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు నేడు మరియు మిగిలిన 50 శాతం మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు రేపు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడిగరేవుల నందు నేడు తెలుగు మరియు రేపు హిందీ సబ్జెక్టు నందు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరిమద్దుల పాఠశాల నందు నేడు లెక్కలు మరియు రేపు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గని నందు నేడు బయాలజీ రేపు సోషల్ స్టడీస్ సబ్జెక్టు నందు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గడివేముల ఎంఈఓ వసుంధర విమల వసుంధర దేవి తెలిపారు.
Post A Comment:
0 comments: