మేడ్చల్ నుంచే మల్లారెడ్డిపై పోటీ చేస్తా,,, తీన్మార్ మల్లన్న

 మేడ్చల్ నుంచే మల్లారెడ్డిపై పోటీ చేస్తా,,, తీన్మార్ మల్లన్న


తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై తేల్చేశారు. తాను మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. శనివారం రోజున మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అయితే.. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు మిగిలే ఉండాలంటే.. తనపై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు. గత పదేళ్లుగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని తెలిపిన తీన్మార్ మల్లన్న.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంతకన్నా అర్హత ఇంకేముంటదని మల్లన్న ప్రశ్నించారు. అయితే.. గత కొంతకాలంగా నవీన్ పోటీపై వస్తున్న వార్తలపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు అంటూ.. కామెంట్ చేశారు. ఈ కామెంట్‌‍పై స్పందించిన తీన్మార్ మల్లన్న.. ఆయన డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తానని.. సెటైర్ వేస్తూనే కొట్టిపారేశారు.

ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన చింతపండు నవీన్.. ఏ పార్టీ తరపున బరిలో దిగనున్నారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. ఆయన బీజేపీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సొంతంగా ఓ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. "తెలంగాణ నిర్మాణ పార్టీ" అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు గతంలోనే మల్లన్న తెలిపారు. ఇప్పటికే ఈ పేరును రిజిస్టర్ కూడా చేయించినట్టు చెప్పుకొచ్చారు. అయితే.. ఆ పార్టీకి ఎన్నికల వరకు గుర్తింపు వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం తన పార్టీ నుంచే బరిలోకి దిగనున్నారు. మరి ఒకవేళ గుర్తింపు రాకపోతే.. విపక్ష పార్టీల్లో ఏదో ఓ దాని తరపున పోటీ చేస్తారా లేదా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తారా అనేది అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: