పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించాలి

గాలి రవిరాజ్ ‌సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)                         

 ‌‌రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలకు సైతం అవసరమయ్యే నిత్యావసర కూరగాయల ధరలు,గ్యాస్,విద్యుత్ చార్జీల ధరలు తగ్గించాలని నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని స్థానిక యంఆర్ఓ కార్యాలయంలో ఆరై ఆంజనేయులు కు వినతిపత్రాన్ని గాలి రవిరాజ్ సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ ఆధ్వర్యం లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు అనునిత్యం వాడే కూరగాయల,నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు కొనాలన్నా వంద రూపాయలకు పైగా ఉండటంతో సామాన్య ప్రజలు ఏమి కొనలేని పరిస్థితి ఏర్పడిందని, మార్కెట్లో కేజీ టమోటాలు, పచ్చిమిరపకాయలు వంద రూపాయలకు పైగా ఉండడంతో మధ్య తరగతి కుటుంబాలు కూరగాయలు కొనలేని స్థితిలో వున్నారని, గ్యాస్ ధరలు, సర్ చార్జీలు పేరుతో విద్యుత్ చార్జీల ధరలు పెంచి ప్రభుత్వం పేద ప్రజలపై అధికం భారం మోపుతుందని,రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని


వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసిన ఫలితం లేదని,రైతు ప్రభుత్వమంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతన్నలను మోసం చేస్తున్నారని,దళారి వ్యవస్థ ప్రజలను,రైతులను దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని,తక్షణమే పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో భూదేవి,పాపులమ్మ, నాగమ్మ,పోతమ్మ తదితరులు పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: