కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల,,,,కేవీపీ సంచలన కామెంట్స్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో ఆమె రెండుసార్లు భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు ఆమె చెప్పినా.. పార్టీ విలీనం కోసమే డీకేతో భేటీ అయ్యారన్న వార్తలు పొలిటకల్ సర్కిల్‌లో చక్కర్లు కొట్టాయి. గత నెల వైఎస్సాఆర్‌టీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇదే విషయమై చర్చించారన్న టాక్ కూడా వినిపించింది. రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది.
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై షర్మిల ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు ఆమెకు ఆహ్వానం పలుకుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నా.. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఈ విషయమై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇటీవల కీలక కామెంట్స్ చేశారు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని.. అలాంటిది షర్మిలను పార్టీలోకి తీసుకుంటే తప్పేంటని భట్టి ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల షర్మిల పార్టీకి దూరమయ్యారని అన్నారు. మళ్లీ తిరిగి వస్తే మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా.. ఆ పార్టీ సీనియర్ నేత, వైఎస్ఆర్ ఆత్మీయులు కేవీపీ రామచంద్రరావు.. షర్మిల కాంగ్రెస్‌లో చేరే అంశంపై సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నా్రు. కాంగ్రెస్ వాదిగా, వైఎస్ బిడ్డగా ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యానించారు. నిన్న ఖమ్మంలో జనగర్జన సభకు రాహుల్ గాంధీ హాజరు కాగా.. గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సహా, వైఎస్ షర్మిల అంశంపైనా భేటీలో చర్చించినట్లు సమాచారం.
రాహుల్ గాంధీతో భేటీ తర్వాత కేవీవీ మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ సూచనలను అమలు చేస్తామని చెప్పారు. త్వరలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కీలక కామెంట్స్ చేశారు. కేవీపీ చేసిన ఈ కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా ? లేక తెలంగాణ నుంచా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతం తన అన్న జగన్ ప్రభుత్వం ఏపీలో కొలువుదీరగా.. తెలంగాణ కోడలిగా ఆమె ఇక్కడ పార్టీని స్థాపించి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Home
Unlabelled
కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల,,,,కేవీపీ సంచలన కామెంట్స్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: