దేశమంతా తెలంగాణ పథకాలుకోరుకొంటోంది
కేంద్రంతోపాటు , తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం ఖాయం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
దేశంలోని ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పథకాలను కోరుకొంటున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి వెల్లడించారు. బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సుమారు 85 లక్షల రూపాయల నిధులతో చేపట్టే పలు కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారంచుట్టారు. బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లోని 26 వ డివిజన్ మధురానగర్ లో 25 లక్షల రూపాయల తో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
అదేవిధంగా3,4,5 వ వార్డుల్లో 50 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను మంత్రి ప్రారంభించారు. ఇదిలావుంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు నిధుల వరద కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఒక ప్రత్యేక విజన్ తో కార్పొరేషన్ సమగ్రాభివృద్ధి చేపట్టి ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్, వైకుంఠ దామాల నిర్మాణంతోపాటు స్వచ్ఛతకు చిరునామాలుగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను నిలుపుతామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్బంగా తాజాగా రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...నాళాల అభివృద్ధికి 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని నియోజకవర్గంలో బడంగ్ పేట్, మీర్ పేట్,జల్ పల్లి ల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఒక వైపు అభివృద్ధిలో ముందుకెళ్తూనే సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
నాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్లను నేడు 2,వేలకు పెంచి, 3 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ ను 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.ఈ ప్రాంతంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్లు అర్హులైన పేదలకు అందిస్తామని, స్వంత స్థలం ఉన్నవారికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కళ్యాణాలక్మి, షాది ముబారక్, రైతు భీమా,రైతు బంధు, రైతులకు ఉచిత విద్యుత్, కుల,చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గౌడన్నలకు5 లక్షల భీమా సౌకర్యం, నేతన్నలకు పెన్షన్, మృత్సకారులకి, ముదిరాజ్ కులస్తులకు చెరువుల్లో ఉచిత చేపలు వదలటం,మార్కెటింగ్ సదుపాయాలు, గొల్ల,కురుమ సోదరులకు గొర్రెల పంపిణీ, రజకులకు,నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, ఎస్ సి,ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇవేవీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో లేవని, దేశమంతా తెలంగాణ పథకాలు కావాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, తప్పకుండా దేశంలో, తెలంగాణ రాష్ట్రం లో బి ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.
Home
Unlabelled
దేశమంతా తెలంగాణ పథకాలుకోరుకొంటోంది,,, కేంద్రంతోపాటు , తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం ఖాయం,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: