ఇష్టారాజ్యంగా గురుకులం ప్రిన్సిపల్ విధులు...

చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగేశ్వరావు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల మండలంలోని లక్ష్మాపురం బాటవద్ద ఉన్నఅంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన పరీక్షకు వందలాదిమంది విద్యార్థినిలు హాజరు కాగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవణమ్మ నిర్లక్ష్య వైఖరి వల్ల పరీక్షకు హాజరైన విద్యార్థినీలు మరియు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు, సిపిఎం నాయకులు పకీర్ సాహెబ్,బెస్త రాజు, గోపాలకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మిగిలిపోయిన సీట్ల కోసం శనివారం రోజున నిర్వహించే పరీక్షకు వందలాదిమంది విద్యార్థులను మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 10:00 గంటలకు నిర్వహించే పరీక్షలను రాసినందుకు వచ్చిన విద్యార్థులను 10:00 గంటల సమయం దాటిన పాఠశాలలోకి అనుమతించక పోవడంతో పగిడాలకు వెళ్ళు రహదారి పైననే విద్యార్థులు మరియు తల్లిదండ్రులు నిలబడి ఉండడంతో రహదారిలో ప్రయాణించే వాహనాలతో విద్యార్థినిలు, తల్లిదండ్రులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని,


విద్యార్థుల మరియు తల్లిదండ్రుల అవస్థలను చూడలేక సిపిఎం నాయకులు ప్రధాన గేటు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాఠశాల ఉపాధ్యాయురాలు స్పందించి ప్రధాన గేటును తెరవడంతో విద్యార్థినులను పాఠశాలలోకి వెళ్లారని, 10:00 గంటల సమయం దాటినా ప్రిన్సిపాల్ రవణమ్మ నిర్లక్ష్యం కారణంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థినులను తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని,ప్రిన్సిపల్ రమణమ్మ పై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ముందు విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: