మహంకాళి ఆలయంలో రుద్ర త్రిశతి హోమము,,,, బిల్వార్చన పూజలు

(జానో జాగోో వెబ్ న్యూస్-హైదరాాబాద్  ప్రతినిధి)

75వ వార్షిక బోనాల వజ్రోత్సవాల ఉత్సవాల సందర్భంగా హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న  మహంకాళి ఆలయంలో సోమవారం సాయంత్రం లయ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్, ఎస్.శైలజ దంపతులు  రుద్ర త్రిశతి హోమము మరియు బిల్వార్చన పూజలు ఆనిర్వహించారు. ఆలయ పూజారులు రవి నారాయణ మూర్తి, గోపాల్ మహారాజ్, సుధీర్, దీపక్ పంతుల అధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, కార్యదర్శి కె దత్తాత్రేయ, కోశాధికారి ఏ.సతీష్, ప్రతినిదులు డి.అర్.ప్రభాకర్, ఏ.విజయ్ కుమార్, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

 




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: