మెడికల్ కాలేజీ మంజూరు  చేసినందుకు హర్షం వ్యక్తంచేస్తూ

కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్  నేతల పాలాభిషేకం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో నేతల సంబరాలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మెడికల్ కాలేజీలను బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గానికి కూడా ఓ మెడికల్ కాలేజీని సీఎం మంజూరు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నపంపై స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. ఈ  క్రమంలోనే  మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆధ్వర్యంలో మీర్ పేట్ కార్పొరేషన్ లో  బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం నిర్వాహించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు సంబరాలు  నిర్వహించుకొన్నారు. 









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: