రోజులైనా చంద్రబాబు మళ్లీ సీఎం  కాలేరు... బొత్స సత్యనారాయణ

ఎన్ని రోజులైనా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేర అని పీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.  తెలంగాణ విద్యా వ్యవస్థపై ఇటీవల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలపై మీరేమంటారని మీడియా ప్రశ్నించగా... దీనికి సంబంధించి తాను రెండు రోజుల తర్వాత మాట్లాడుతానని బొత్స సమాధానం ఇచ్చారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 165 రోజులు కాదు 660 రోజులైనా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని విమర్శించారు. 

నిధులు దారి మళ్లించారన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని, కానీ తమపై విమర్శలు సరికాదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ నిధులు దోచుకున్నారన్నారు. ఇప్పుడు డబ్బులు ఎవరి దారి మళ్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రజల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వివిధ పథకాల ద్వారా నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలపై స్పందిస్తూ... వివరాలు తెలుసుకొని వాటి భర్తీపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: