రేపటి నుంచి లాల్ దర్వాజ బోనాలు,,,మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

 రేపటి నుంచి లాల్ దర్వాజ బోనాలు


లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, అంబర్‌పేట్ బోనాల సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జులై 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు అనుమతించరు. ఓల్డ్ సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దార్-ఉల్-షిపా క్రాస్ రోడ్ ఛత్రినాక, ఇంజన్ బలి వద్ద ఆ వాహనాలను నిలిపివేసి దారి మళ్లించనున్నారు.

ఉప్పల్ నుంచి అంబర్‌పేట వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను హబ్సిగూడ, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్ మీదుగా ఉప్పల్ క్రాస్ రోడ్డుకు మళ్లిస్తారు. ఇక కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే బస్సులను ఫీవర్ హాస్పిటల్, తార్నాక, హబ్సిగూడ మీదుగా ఉప్పల్ క్రాస్ రోడ్‌కు మళ్లింపు చేపట్టనున్నారు.

ఇక బోనాలకు వచ్చే భక్తులకు దేవీ ఫ్లైవుడ్, శాలిబండ, అల్కా థియేటర్, ఆర్య వైశ్య మందిర్, సాధా థియేటర్ లేన్, వీడీపీ స్కూల్ గ్రౌండ్, మిత్ర స్పోర్ట్స్ క్లబ్, అప్పర మేనక టాకీస్, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, లక్ష్మీ నగర్ సరస్వతి విద్యానికేతన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఫలక్‌నుమా, ఫూల్‌బాగ్ చమన్, చార్మినార్ బస్ టెర్మినల్‌లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.

ఇంజినీబౌలి-ఫలక్‌నుమా-అలియాబాద్, షంషీర్‌గంజ్ 'టి' జంక్షన్-గోశాల, తద్బన్ -గోశాల మిస్రిగంజ్, ఖిల్వత్-ఇంజిన్ బౌలి -జహనుమా-నాగుల్చింత-లాల్ దర్వాజా టెంఫుల్-నెహ్రూ మోడ్-గౌలిపురా-మిర్‌చౌక్ రూట్‌లో ట్రాఫిక్ రద్దీ ఉండనుంది. ఇక పంచ మొహల్లా నుంచి వోల్గా హోటల్, మిస్రిగంజ్, రాజన్న బౌలి, రామస్వామి గంజ్, కందికల్గేట్, పాత ఛత్రినాక పీఎస్ వై జంక్షన్, గౌలిపురా, నెహ్రూ విగ్రహం, నాగుల్చింత జంక్షన్ రూట్లలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలాగే చాదర్‌ఘాట్,నూర్ఖాన్ బజార్, ఎస్‌జే రోటరీ, శివాజీ బ్రిడ్జ్, సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్, పురాణి హవేలీ రోడ్, శివాజీ బ్రిడ్జ్, ఖిల్వత్ రోడ్, లాడ్ బజార్, ఖిల్వత్ ప్లేగ్రౌండ్ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఇక గౌలిగూడ, సిద్దియాంబర్ బజార్, అఫ్జల్‌గంజ్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, శివాజీ బ్రిడ్జ్, మదీనా 'ఎక్స్' రోడ్, చార్మినార్ బస్ టెర్మినల్,హిమ్మత్‌పురా, నాగుల్చింత, అలియాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఉండనుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల వైపు ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: