బండి సంజయ్ కు ఏపీలో కీలక పదవి అంటూ ప్రచారం

 బండి సంజయ్ కు ఏపీలో కీలక పదవి అంటూ ప్రచారం


గత కొంతకాలంగా కమలం పార్టీలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు,బండి సంజయ్ స్థానంపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రకటించిన ఈ జాబితాలో దక్షిణాది నుంచి కేవలం బండి సంజయ్ కు మాత్రమే అవకాశం దక్కింది. మరోవైపు బండి సంజయ్ కు సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమించబోతున్నారనేదే ఆ ప్రచారం. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జీగా ఉన్న సునీల్ దేవధర్ ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఆయన స్థానంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జీగా మరో నాయకుడిని నియమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమిస్తే... వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ బలం పెరుగుతుందనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: