గడివేములలో ఘనంగా గురు పౌర్ణమి.... వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం లోని గడివేములలో మఠం వద్ద వెలిసిన సాయిబాబా దేవాలయం నందు గురు పౌర్ణమి వేడుకలు దాసి నాగిరెడ్డి, దేశం వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ భారతీయ సంస్కృతి భగవంతుని కంటే ఉన్నత స్థానాన్ని గురువుకు ఇచ్చి గౌరవించిందనీ, అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌నీ,  అజ్ఞానమనే చీకటి వల్ల మూసుకుపోయిన కళ్లను జ్ఞానమనే వెలుగుతో ప్రకాశింపచేసి, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే పరబ్రహ్మ స్వరూపులు గురువులని,


ప్రజలు భక్తి మార్గంలో పయనించి తల్లిదండ్రులను, గురువులను,పెద్దలను గౌరవించాలని,  భక్తి మార్గంలో ఆధ్యాత్మిక చింతన ద్వారా మనశ్శాంతి పొందవచ్చునని నంద్యాల పట్టణానికి చెందిన సాయి సేవ సమితి ట్రస్టు కు చెందిన లక్ష్మీదేవి, సావిత్రమ్మలు ప్రవచనాలతో భక్తులకు సూచించారు.  అనంతరం సాయిబాబా గుడి వద్దకు వచ్చిన భక్తాదులందరికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గడివేముల సాయిబాబా సేవకులు ప్రశాంత్,తిరుపాలు,మధు, యశ్వంత్ మరియు సాయిబాబా భక్తాదులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: