భవిష్యత్తుకు గ్యారెంటీ....బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికిన..... 

పాణ్యం టిడిపి ఇన్చార్జ్ గౌరుచరిత రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య బస్సుయాత్ర"నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా పాణ్యo మాజీఎమ్మెల్యే మరియు టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో నన్నూరు గ్రామంలో పాణ్యం నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, మండలాల కన్వీనర్లు, కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నన్నురు గ్రామంలో గుడి మసీదు, చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ


రాష్ట్రంలోని పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కేవలం టిడిపి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని, వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని, నేడు రాష్ట్రం అభివృద్ధిలో శూన్యమని, రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి కొరకు "మీ భవిష్యత్తుకు గ్యారెంటీ" పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం, సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు,ప్రతి ఇంటిలో చదివే విద్యార్థులందరికీ 1500 రూపాయలు,రైతన్నలకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,రాష్ట్రంలోని ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మినీ మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని తెలిపారు.

అనంతరం చైతన్యరథం బస్సులో ఉమ్మడిజిల్లా నాయకులతో ప్రయాణించి లోద్దిపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీజెండాని ఆవిష్కరించి ఉయ్యాలవాడ,ఉప్పలపాడు గ్రామాలలోని ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని పథకాల గురించి వివరించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నంద్యాల,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్,బీటీ. నాయుడు,ఎమ్మెల్సి యన్ ఏండి ఫరూక్,మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి,డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి,నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, కర్నూలు పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు ముంతాజ్ బేగం,పాణ్యం నియోజకవర్గo లోని కల్లూరుఅర్బన్, ఓర్వకల్లు,కల్లూరు,గడివేముల,పాణ్యo మండలాల టిడిపి అధ్యక్షులు,తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,ఓర్వకల్లు మండలం నాయకులు, సర్పంచ్లు,నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు,బ్రహ్మణ పల్లె ఉప్పలపాడు,ఉయ్యాలవాడ గ్రామ టిడిపి నాయకులు,మైనారిటీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: