అన్ని రకాల క్రీడలకు అనువుగా క్రీడా మైదానం ఏర్పాటు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

పలు పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ కార్పోరేషన్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేయనున్న క్రీడా మైదానం, స్పోర్ట్స్ కంప్లెక్ల్స్,ట్రoక్ లైన్,చెరువు సుందరి కరణ పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రౌండ్ లో ఆటలు ఆడుతున్న క్రీడాకారులతో మాట్లాడి ఎలాంటి సౌకర్యాలు కావాలని అడిగి తెలుసుకున్నారు.


క్రికెట్ తో సహా అన్ని రకాల క్రీడలు ఆడుకునేందుకు వీలుగా గ్రౌండ్ ను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మైదానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత,  క్రీడాకారులదే అన్నారు. పనులు పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేసే స్థలాన్ని సందర్శించారు.

 

శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి


సోెమవారంనాడు మహేశ్వరం నియోజకవర్గంలోని పలు పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి గురు పౌర్ణమి సందర్భంగా  దిల్ సుఖ్ నగర్ లోగల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన పూజ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి పూజలు నిర్వహించారు. Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: