కేసీఆర్ ప్రత్యేక చొరవతో,,,,గ్రామాల రూపురేఖలు మారిపోయాయి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం మండలం అమీర్ పేట్,గట్టుపల్లి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూ సుమారు 18  కోట్ల పై చిలుకు నిధులతో చేపట్టే పలు కార్యక్రమాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్  పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చివేసారని, ఒక ప్రత్యేక విజన్ తో సమగ్రాభివృద్ధి దిశగా పల్లె సీమలు ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ,క్రీడా మైదానాలు,నర్సరీలు, వైకుంఠ దామాలు,


ట్రాక్టర్,ట్రాలీ, ట్యాంకర్ల లాంటి సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్నాయని అన్నారు. పూర్తి స్వచ్ఛ గ్రామాలుగా నేడు పల్లెలు మారాయని అన్నారు. ఇటీవలి మహేశ్వరం పర్యటన సందర్భంగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలకు 10 లక్షల చొప్పున నిధులు, మెడికల్ కళాశాల, సబ్ స్టేషన్ లను  మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు..

అభివృద్ధి-సంక్షేమాలు రెండు కళ్ళ లాగా,అవే నినాదాలుగా, విధానాలుగా  ముందుకెళ్తూన్నట్లు, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే  దక్కుతుందన్నారు. నాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్లను నేడు 2,వేలకు పెంచి,  3 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ ను 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్లు అర్హులైన పేదలకు అందిస్తామని,స్వంత స్థలం ఉన్నవారికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కళ్యాణాలక్మి, షాది ముబారక్, రైతు భీమా, రైతు బంధు, రైతులకు ఉచిత విద్యుత్, కుల,చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గౌడన్నలకు5 లక్షల భీమా సౌకర్యం, నేతన్నలకు పెన్షన్, మృత్సకారులకి, ముదిరాజ్ కులస్తులకు చెరువుల్లో ఉచిత చేపలు వదలటం, మార్కెటింగ్ సదుపాయాలు, గొల్ల, కురుమ సోదరులకు గొర్రెల పంపిణీ, రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, ఎస్ సి, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇవేవీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో లేవని, దేశమంతా తెలంగాణ పథకాలు కావాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, తప్పకుండా దేశంలో, తెలంగాణ రాష్ట్రం లో బి ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.

మహేశ్వరం  మండల  పరిధిలోని  మన్సా న్ పల్లినుండి గట్టు పల్లి మీదుగా -కోళ్లపడకల్  వరకు 15 కోట్ల 20 లక్షల నిధులతో  బీటీ  డబుల్ రోడ్డు  నిర్మాణ పనులకు, గట్టు పల్లి తండా నుండి దావూద్ గూడ తండా వరకు 1 కోటి 80 లక్షల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అదే విధంగా గట్టుపల్లి గ్రామంలో 10 లక్షలతో చేపట్టిన యూజీడి పనుల ప్రారంభోత్సవంతో పాటు,


రూ. 8 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు.ఒక కోటి 9 లక్షల రూపాయల నిధులతో అమీర్ పేట్ గ్రామంలో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో జడ్పీ  చైర్ పర్సన్ అనితా రెడ్డి, ఎంపీపీ  రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ  సునీతా అంధ్యానాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: