పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన,,,
జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడివేముల మండలంలో అమలవుతున్న విద్యా సంబంధిత కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా ఎంఈఓ కార్యాలయంలో జగనన్న విద్యా కానుక పంపిణీ, బయోమెట్రిక్,ఐడెన్టిఫికేషన్ మరియు GER సర్వే స్టేటస్ ల పరిశీలించి,గడివేముల సచివాలయం 1 లో వెల్ఫేర్ అసిస్టెంట్లు అరుణ, బాసూర్ బి మరియు వాలంటీర్లతో జిఈఆర్ సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించి సచివాలయం పరిధిలో ఉన్న విద్యార్థుల పేర్లను100% నమోదు చేసి ఎల్లో ఈ బ్యాడ్జి ని సాధించే విధంగా వాలంటీర్లు,వెల్ఫేర్ అసిస్టెంట్లు తప్పనిసరిగా కృషి చేయాలని సూచించిన
అనంతరము గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మోడల్ స్కూల్ లను పర్యవేక్షించి పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్ ను పరిశీలించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మరియు విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు అందరూ తైమాసిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని,విద్యార్థిని విద్యార్థులు అందరూ బాగా చదువుకుని తల్లిదండ్రులకు మరియు పాఠశాలలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సలహాలు సూచనలు అందించిన అనంతరం కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంఈఓ బ్రహ్మంనాయక్ మరియు ఎంఈఓ విమల వసుంధరదేవి పాల్గొన్నారు.
Home
Unlabelled
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన,,, జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: