కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ ట్రైన్లు రద్దు

కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ ట్రైన్లు రద్దు

కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్‌ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇటీవల వచ్చిన వరదలు, మూడో లైను నిర్మాణ పనుల కారణంగా మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు ట్రైన్లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఆ ట్రైన్లను తాజాగా ఆగస్టు 6వ తేదీ వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపారు.

రద్దైన ట్రైన్లలో కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ పుష్‌పుల్‌ రైలు (ట్రైన్ నెంబర్ 07753/54), సికింద్రాబాద్‌-వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌ (ట్రైన్ నెంబర్ 07462/63), కాజీపేట- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే రామగిరి ఎక్స్‌ప్రెస్‌ ( ట్రైన్ నెంబర్ 17003/4), కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ (17035/36), భద్రాచలం రోడ్‌- బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్ 17033/34) ట్రైనును వచ్చే నెల 6 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ ట్రైన్ ప్రయాణికులకు కూడా రైల్వేశాఖ చేదువార్త చెప్పింది. వారం పాటు 22 పలు ట్రైన్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల నేపథ్యంలో ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 31 నుంచి వచ్చే ఆగస్టు 6 వరకు.. సంబంధిత రైళ్ల రద్దు ఉంటుందని పేర్కొన్నారు. రద్దైన ట్రైన్లలో లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే 12ఎంఎంటీఎస్  ట్రైన్లు ఉన్నాయి. ఉందానగర్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడిచే మరో 10 ఎంఎంటీఎస్‌లు కూడా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: