శామీర్‌పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్,,,అందులో భాగంగానే కాల్పులు

 శామీర్‌పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్


హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట మనోజ్ కుమార్ అనే యువకుడు.. సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సెలబ్రెటీ క్లబ్‌లోని విల్లాలో ఎయిర్‌ గన్‌తో కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్ధార్థ్ దాస్ భార్య స్మితాతో గత మూడేళ్లుగా మనోజ్ కుమార్ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధార్ధ్ దాస్, స్మిత దంపతులు. సిద్ధార్థ్ విశాఖలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఇద్దరు పిల్లలు అయితే 2009 నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019లో ఇద్దరూ విడాకులకు అప్లై చేసుకున్నారు. పిల్లలు ఇద్దరూ స్మిత వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మనోజ్ కుమార్‌తో 2019 లోనే స్మితకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఓ సాప్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేసి పార్ట్‌నర్స్‌గా ఉంటున్నారు. సెలబ్రెటీ క్లబ్‌లోని ఓ విల్లాలో కార్యాలయంతో పాటు అక్కడే నివాసం ఉంటున్నారు.

అయితే స్మిత కుమారుడు(17) ఇంటర్ చదవుతుండగా.. తనను మనోజ్ వేధిస్తున్నాడని ఆ బాలుడు చైల్డ్ ప్రొటెక్షన్ సెల్‌ను ఆశ్రయించాడు. తన చెల్లి (13)ని కూడా మనోజ్ వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయాన్ని తన తండ్రి సిద్ధార్థ్ దాస్‌కు కూడా తెలియజేశాడు. దీంతో పిల్లల్ని చూసేందుకు సిద్ధార్థ్ దాస్ ఇవాళ ఉదయం సెలబ్రెటీ క్లబ్‌లోని ఓ విల్లాకు వచ్చాడు. అయితే అంతకుముందే సిద్ధార్థ్ తాను ఉండే పరిసరాలకు రాకుండా స్మితా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంది. దాన్ని ఉల్లంఘించి సిద్ధార్థ్ విల్లాకు రావటంతో స్మితా, మనోజ్, సిద్ధార్థ్ మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

విచక్షణ కోల్పోయిన మనోజ్ సిద్ధార్థ్‌పై ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. అందులో పిల్లెట్స్ లేకపోవటంతో సిద్ధార్థ్ దాస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై సిద్ధార్థ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే స్మిత మాత్రం మనోజ్‌నే సపోర్ట్ చేయటం కొసమెరుపు. తన పిల్లల్ని మనోజ్ కొట్టలేదని.. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నందున ఒకటి రెండు సార్లు మందలించినట్లు చెప్పటం గమనార్హం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: