ఈ రహదారికి మోక్షం కల్పించండి

సిపిఐ(యంయల్)ఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్


(జానో జాగోో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

పేరుగొప్ప వూరు దిబ్బ అన్న చందంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని సిరివెళ్ళ నుండి నర్సాపురం గ్రామానికి వెళ్లే వరకు రహదారి అస్తవ్యస్తంగా తయారై ప్రయాణాలు కొనసాగించడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ (యంయల్ )ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ విమర్శించారు. ఈ సందర్భంగా సిరివెళ్ళ, రుద్రవరం రహదారి లో రవిరాజ్ మాట్లాడుతూ ఆళ్ళగడ్డ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందడుగులో ఉందని చెప్తున్న నాయకులకు ఈరహదారిలో వెళ్లే ప్రయాణికుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.సిరివెళ్ళ నుండి నర్సాపురం వరకు ప్రయాణాలు కొనసాగించాలంటే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని, నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు యసి కాలనీలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన వర్షపు నీరు ఇండ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు,నాయకులు స్పందించి సిరివెళ్ల నుండి నర్సాపురం రహదారిని బాగు చేసి, ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు..

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: