పవన్ కల్యాణ్‌ను చిరంజీవి అలా ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమైంది

చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై నాని స్పందించారు.

చంద్రబాబుతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే కరెక్ట్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారని, అందుకే కొన్నిరోజుల క్రితం ఆయన రాజకీయాలకు తన కంటే తన తమ్ముడు సరిపోతాడని వ్యాఖ్యానించాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో జత కలవడం, అబద్దాలు చెప్పడం, విషం చిమ్మడం చిరంజీవి వల్ల కావని, అవి పవన్ మాత్రమే చేయగలడని విమర్శించారు. రాజకీయాలకు తన తమ్ముడు సూట్ అవుతాడని చిరంజీవి మహాత్ముడు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందన్నారు.

2019 ఎన్నికలకు ముందు కాపు ఓటర్లు జగన్ కు వేస్తారేమోనని పసిగట్టిన పవన్ ఆరు నెలల ముందు చంద్రబాబు నుండి పక్కకు జరిగి, కాపు ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబును పూలతో కొడుతూ ఆయనకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారన్నారు. కాపు ఓట్లు జగన్ కు రాకూడదని కుట్ర చేశారని, కానీ కాపులు మాత్రం జనసేనాని కుట్రను పసిగట్టి వైసీపీకి అండగా నిలబడ్డారన్నారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చుతామని మోసం చేశాడని విమర్శించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: