దున్నపోతు ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చింది
నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. కోవూరు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ఈ సాయంత్రం కావలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కావలి ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర సతీమణి బీద జ్యోతి, నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, విచిత్రవేషధారణలు, బాణాసంచా మోతలతో హోరెత్తించారు.
అంతకుముందు, కోవూరు నియోజకవర్గం రాజుపాలెం పీఎస్సార్ కళ్యాణమండపం క్యాంప్ సైట్ వద్ద యానాది సామాజికవర్గ ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... దున్నపోతు ప్రభుత్వానికి బైబై చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చుని ఎస్టీ సబ్ ప్లాన్ లెక్కల్లో రాస్తున్నారని ఆరోపించారు.
యానాదులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం వెనక్కి లాక్కుందని,. యానాదులకు న్యాయం జరగాలి అంటే సైకో పోవాలి... సైకిల్ రావాలి అని స్పష్టం చేశారు. జగన్ పాలనలో ఐటీడీఏని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రుణాలు ఇవ్వడం లేదని, గిరిజన గురుకుల పాఠశాలలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. కనీస మౌలిక సదుపాయాలు లేవని, యానాదులకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని వివరించారు. జగన్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. జగన్ ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మోసం చేశారని వెల్లడించారు.
యానాదులను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం పెళ్లి కానుక ఇవ్వడం లేదని, పెళ్లికానుకకు అనేక కండిషన్స్ పెట్టారని ఆరోపించారు. యానాదుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలని కోరారు. యానాదులకి జగన్ పాలనలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని విచారం వ్యక్తం చేశారు.
Home
Unlabelled
దున్నపోతు ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: