సినీ కార్మికులకు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నారు
సినిమా అంటే హీరో ఒక్కడే కాదని, సినిమా బడ్జెట్లో అత్యధిక భాగం హీరోల పారితోషికాలకే వెళుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సినిమా హీరోల పారితోషికాలపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సల్మాన్ ఖాన్ తదితర పెద్ద హీరోలు ఒక సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోందని, ఓ సినిమా బడ్జెట్లో మూడో వంతు ఇలా హీరోలకు పారితోషికం ఇచ్చేందుకే సరిపోతోందని వెల్లడించారు. భారత చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల మంది కార్మికులు ఉంటారని, వారికి మాత్రం నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం తనవంతు చర్యలు తీసుకోవాలని కేంద్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు విజ్ఞప్తి చేశారు. సినిమా బడ్జెట్లో అధికభాగాన్ని రెమ్యూనరేషన్ రూపంలో హీరోలకు అందించే పరిస్థితులను మార్చాలని, ఆ మేరకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Home
Unlabelled
సినీ కార్మికులకు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: