అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం 75వ బోనాల వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం గౌలిపూర కమేల ప్రాంతంలోని శ్రీ బంగారు మైసమ్మ  అమ్మవారికి, ఉప్పుగుడా వివేకానంద నగర్ లోని శ్రీ బంగారు మైసమ్మ కి, లాల్ దర్వాజా మక్-డూమ్-పుర శ్రీ ఎల్లమ్మ కి మరియు దూద్ బౌలి శ్రీ పనీరు ముత్యాలమ్మ అమ్మవారికి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, ప్రతినిదులు జి.రాజారత్నం, ఎస్.పి.క్రాంతి కుమార్, జి.శ్రీనివాస్, ఏ.రజత్, ఈశంత్ సూరి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేవాలయాల ప్రతినిదులు అశోక్ కుమార్, యదయ్య, విశాల్, విక్రమ్, ఆనంద్ గుప్తా, వెంకట చలం, నరసింహ రావు, సంతోష్ ఇతర సభ్యులు వారికి స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదం అందచేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: