కేసీఆర్ ను ఓడించేందుకు మా కార్యకర్త చాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముంటే గజ్వేల్ నుండి మళ్లీ పోటీ చేయాలని, అలాగే సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మీడియా లీడ్ ఇదే... నేను చెప్పింది రాయండి.. అంటూ విలేకరులకు సూచించారు. గాంధీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు తాను అవసరం లేదని, తమ పార్టీ కార్యకర్త చాలు అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే గజ్వేల్ నుండి పోటీ చేయాలని, లేదంటే మాడ అని ఒప్పుకోవాలన్నారు. కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తే తాను అక్కడి నుండి సిద్ధమని బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారని, ఆయన పోటీ చేస్తారా? అడగండి అన్నారు.


విద్యుత్ తో తెలంగాణలో వెలుగులు నింపిందే నిజమైతే బీఆర్ఎస్ లో ఎవరిచోట్ల వారు పోటీ చేయాలన్నారు. తన సవాల్ కు కేటీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ స్వప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుండి పోటీ చేస్తే గెలుస్తానో కేసీఆర్ సర్వేలు చేయించుకుంటున్నారని, కానీ గజ్వేల్ నుండే పోటీ చేసి, సత్తా నిరూపించుకోవాలన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని చెబుతున్నారని, కానీ మీ ముఖం అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలో 3500 సబ్ స్టేషన్లు ఉన్నాయని, 24 గంటల విద్యుత్ ఉందని అక్కడకు వెళ్లి చూద్దామా? అని సవాల్ చేశారు. విద్యుత్ ఇచ్చినట్లు తేలితే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు అడగదని, 24 గంటలు ఇవ్వలేదని తేలితే బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదన్నారు. సిగ్గు.. శరం ఉంటే ఈ సవాల్ స్వీకరించాలని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణ మంత్రుల వాదనలో పస లేదన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: