దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రెడ్డిపై,,,

బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి మరో ట్వీట్

బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి ఈ మధ్య తన ట్వీట్లతో హాట్ టాపిక్‌గా మారారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నారు. మొన్నే.. ఓ వ్యక్తి గేదే తోకను పట్టుకుని వెనక భాగంలో తన్నుతూ టక్కులోకి ఎక్కిస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ... బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ట్వీట్ అటు బీజేపీ శ్రేణులతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం రేపింది. అయితే.. జితేందర్ రెడ్డి ఆ ట్వీట్‌ను.. ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ ట్వీట్ చేశారు అన్నది తీవ్ర చర్చనీయాశంగా మారింది. మొదట పార్టీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరం అని రాసి.. కాసేపటికి మళ్లీ దాన్ని డిలీట్ చేసి.. రాష్ట్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారికి ఇలాంటి ట్రీట్‌మెంట్ కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. అందులో మొదటిది బండి సంజయ్‌ టార్గెట్‌గా ఉందని అనుకోగా.. ఆ తర్వాత పెట్టింది మాత్రం ఈటల, కోమటిరెడ్డిని దృష్టిలో పెట్టుకునే చేసినట్టు తెలిసింది.

ఇదిలావుంటే ఇప్పుడు మరో ట్వీట్ చేశారు జితేందర్ రెడ్డి. అయితే.. ఇందులో మాత్రం ఇన్‌డైరెక్టుగా కాకుండా.. నేరుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గురించి చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన మాట్లాడిన వీడియోతో పాటు.. రఘునందన్ గురించి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టేశారు జితేందర్ రెడ్డి. రఘునందన్ తన ప్రత్యర్థిపై కేవలం గాలి మాటలతో కాదు.. ఫక్తు ఆధారాలతో విరుచుకుపడుతుంటారని బీజేపీ శ్రేణులు చెప్తుంటారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థికి చెమటలు పట్టించే రఘునందన్ రావు జాతీయ అధికార ప్రతినిధి చేయాలని.. తన అభిప్రాయాన్ని ట్వీట్‌తో చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌ను బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డాలకు ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులతో పాటు ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు అధిష్ఠానం సన్నాహాలు చేస్తుందన్న నేపథ్యంలో... జితేందర్ రెడ్డి ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే.. గత కొంత కాలంగా రఘనందన్ రెడ్డి సైలెంట్ అయ్యారు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వనందుకే రఘనందన్ అసంతృప్తితో ఉన్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డి ట్వీట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: