విశాఖ వద్ద 40 ఎకరాల్లో ఓబెరాయ్ హోటల్...శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్


స్టార్ హోటళ్ల నిర్వహణలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఓబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ విశాఖ ప్రాంతంలో భారీ హోటల్ నిర్మాణానికి సిద్ధమైంది. భీమిలి మండలం అన్నవరం గ్రామంలో సముద్రతీరంలో పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల విస్తీర్ణంలో ఓబెరాయ్ హోటల్ నిర్మించనున్నారు. ఈ హోటల్ నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ 7 స్టార్ లగ్జరీ హోటల్/రిసార్ట్ నిర్మాణానికి సీఎం జగన్ రేపు (జులై 9) తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఏర్పాట్లను సమీక్షించారు. పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి ఓబెరాయ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: