రేపటి నుంచి శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయ

32వ వార్షికోత్సవ బోనాల జాతర ప్రారంభం

ఈ నెలం 13నుంచి నుంచి 18వ తేదీ వరకు బోనాల  ఉత్సవాలు

ముఖ్యఅతిధులుగా హాజరుకానున్న పలువురు ప్రముఖులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ పాతబస్తీలోని దూద్ బౌలిలోని శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయ  32వ వార్షికోత్సవ బోనాల జాతర ఉత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ బోనాల జాతర ఉత్సవాలు  ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బుదవారంనాడు శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ ఛైర్మన్, ఉమ్మడి దేవాలయల కమిటీ సభ్యులు  దోరేటి ఆనంద్ గుప్త మాట్లాడుతూ... ఈ బోనాల జాతర ఉత్సవాల గురించి వెల్లడించారు.



రేపటి నుంచి వచ్చే మంగళవారం వరకు జరిగే ఈ బోనాల జాతర ఉత్సవాలకు వివిధ ప్రముఖులు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ప్రతి ఏడాది ఈ బోనాల జాతరను అనావాయితీ ప్రకారం ఘనంగా నిర్వహించుకొంటున్నాయని, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. గత 31 సంవత్సరాల నుంచి ఈ బోనాల కొనసాగుతోందని, ఇపుడు 32వ బోనాల జాతర జరగనున్నదని ఆయన తెలిపారు. ఇటీవల ఆలయంలో శ్రీ పైనీరు ముత్యాలమ్మ నూతన విగ్రహాన్ని కూడా పున:ప్రతిష్టింపజేశామని ఆయన వెల్లడించారు.

శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయాన్ని ఉమ్మడి దేవాలయాల కమిటీలో ఏడేళ్ల కిందట  చేర్చామని ఆయన తెలిపారు.  ఈ బోనాల జాతర ఉత్సవాలకు హర్యాన  గవర్నర్ బండారు దత్తాత్రేయ,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు.

అదే సందర్బంలో రేపటి నుంచి వచ్చే మంగళవారంనాడు వరకు బోనాల జాతర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు కట్ట వెంకటచలం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహారావు ముదిరాజ్(బబ్లు), కోశాధికారి బుస్సా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి జరిగే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ నెల 13 తేదీ అనగా రేపు

ఉ॥ 6 గం॥లకు అభిషేకము, 8.00 గం॥లకు కలశస్థాపన పూజ

సా॥ 6 గం||లకు అమ్మవారి ఘటము ఎదుర్యోకు, శ్రీ మల్లన్న దేవాలయము

బహదూర్పూరా నుండి దూద్ బౌలి మీదుగా మహారాజ్ గంజ్, చటక్ని పుర వీధుల నుండి అమ్మవారి దేవాలయమునకు చేరును.

ఘటాదారులు నరేష్ ,,,రాజు ప్రకాష్


14 వ తేదీ శుక్రవారంనాడు

ఉ॥ 6 గం||లకు అమ్మవారి అర్చన

మ॥ 2గం॥లకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, చప్పనో ్బగ్ నివేదన, 

15 తేదీ శనివారంనాడు

ఉ|| 6గం||లకు అమ్మవారికి శాకాంబరి అలంకరణపూజ 

మా॥2 గం||లకు అమ్మవారి తొట్టెల ఊరేగింపు హుస్సేని ఆలం నుండి పోతరాజు.. లాల్సింగ్ మేళతాళాలతో అమ్మవారి దేవాలయమునకు చేరును..


16 వ తేదీ ఆదివారంనాడు

ఉ॥ 5 గం॥లకు అమ్మవారి అభిషేకం, పూజ, అమ్మవారికి బోనాలు

ముఖ్యఅతిధులచే పూజా కార్యక్రమము తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును.

సాయంత్రం 7.30 ని॥ లకు అమ్మవారి దేవాలయం వద్ద స్వాగత వేదిక నుండి

అమ్మవారి ఘటము, అమ్మవారి పలారం బండ్లకు, పోతరాజులు మరియు

బోనాల ఊరేగింపులకు ముఖ్యఅతిధుల స్వాగతించెదరు.

తేది. 17-7-2023 సోమవారము

ఉ॥ 10.30 ని॥లకు సుగుణమ్మ గారిచే రంగము తర్వాత గాపు

మరియు బలిగంచి ను॥ 3.00 గం॥ లకు అమ్మవారి ఘటము దేవాలయ

నుండి దూద్ బౌలి మీదుగా, బారగల్లి, హుస్సేనీ ఆలం, కసరట్ట, చార్మినార్

చేరును. ఉమ్మడి దేవాలయ ఊరేగింపులో కలసి ముచుకుందానదీ తీరం.

(ఢిల్లీదర్వాజ)కు చేరుతుంది..

తేది. 18-7-2023  మంగళవారంనాడు

ఉ. 6 గం||లకు అమ్మవారికి పూల అలంకరణ పూజ

సా,,4గంటలకు  అన్నప్రసాద వితరణ  జరుగును



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: