ఈ నెల 23వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు ట్రైన్లు రద్దు

ఈ నెల 23వ తేదీ వరకు  తెలుగు రాష్ట్రాల్లో పలు ట్రైన్లు రద్దు


తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించనున్నట్లు తెలిపారు.

విజయవాడ-బిట్రగుంట(ట్రైన్ నెంబర్. 07978) ట్రైన్‌ను 16వ తేదీ నుంచి 22 వరకు రద్దు చేయగా.. బిట్రగుంట-విజయవాడ(07977), బిట్రగుంట-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట(17238), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం-రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం(17267), విజయవాడ-విశాఖపట్నం(22702), విశాఖపట్నం-విజయవాడ(22701), విశాఖపట్నం-కాకినాడ పోర్ట్(17268), విజయవాడ-గూడూరు(07500) రైళ్లను 17 నుంచి 23వరకు క్యాన్సిల్ చేశారు. గూడురు-విజయవాడ(07458) ట్రైన్‌ను 18 నుంచి 24 వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైళ్లు పేర్కొంది.

ఇక నర్సాపూర్-గుంటూరు(17282), గుంటూరు-నర్సాపూర్(17281) ట్రైన్‌ను 17 నుంచి 23 వరకు విజయవాడ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ధన్‌బాద్-అల్లెప్పి(13351) రైలును 18,21,22వ తేదీలలో, హటియా-బెంగళూరు(12835) ట్రైన్‌ను 18న, టాటా-బెంగళూరు(12889) 21న, హటియా-బెంగళూరు(18637) రైళ్లను 22న నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు.

అటు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా 17 నుంచి 23 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చసింది. కాజీపేట-డొర్నకల్(07753), డొర్నకల్-కాజీపేట(07754) డొర్నకల్-విజయవాడ(07755), విజయవాడ-డొర్నకల్(07756), భద్రాచలం-విజయవాడ(07278), విజయవాడ-భద్రాలచం(07979), సికింద్రాబాద్-వికారాబాద్(07591), వికారాబాద్-కాచిగూడ(07592), సికింద్రాబాద్-వరంగల్(07462), వరంగల్-హైదరాబాద్(07463), సిర్పూర్ టౌన్-కరీంనగర్(07766), కరీంనగర్-సిర్పూర్ టౌన్(07765), కరీంనగర్-నిజామాబాద్(07894), నిజామాబాద్-కరీంనగర్(07793), కాజీపేట-సిర్పూర్ టౌన్(17003), బలహర్షా-కాజీపేట్(17004) ట్రైన్లను 23 వరకు రద్దయ్యాయి.

ఇక భద్రాచలం-బలహర్షా(17033), సిర్పూర్ టౌన్-భద్రాచలం(17034), కాజీపేట్-బలహర్షా(17035), బాలహర్షా-కాజీపేట్(17036), కాచిగూడ-నిజామాబాద్(07596), నిజామాబాద్-కాచిగూడ(07593), నాందేడ్-నిజామబాద్(07854), నిజామాబాద్-నాందేడ్(17033) రైళ్లు 17 నుంచి 23 వరకు రద్దు చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: