హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో వింత సంఘటన,,,రూ.వెయ్యికి బదులు రూ.200

 రూ.వెయ్యి డ్రా చేస్తే...రూ.200 వస్తోంది...హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో వింత సంఘటన

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్‌లోని ఓ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలో రూ.1 000 నగదుకు బదులు రూ.200 వస్తున్నాయి. ఇది చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇతరులు డబ్బులు డ్రా చేయడానికి వీల్లేకుండా ఏటీఎంను మూసివేశారు.

రూ.8 వేల నగదు కోసం ఈ ఏటీఎంలకు వెళ్లినవారికి రూ. 600 వచ్చాయి. ఓ వ్యక్తి రూ.8 వేలు డ్రా చేయగా.. రూ.600 మాత్రమే వచ్చాయి. అలాగే కొంతమంది వినియోగదారులకు కూడా అలాగే వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంకు సిబ్బందికి వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏటీఎం టెక్నీషియన్ ఘటనాా స్థలానికి చేరుకున్నాడు. దీంతో ఎందుకు ఇలా తప్పుగా వస్తున్నాయంటూ టెక్నీషియన్‌ను కస్టమర్లు ప్రశ్నించారు. దీంతో వినియోగదారులపై టెక్నీషియన్ దురుసుగా ప్రవర్తించాడు. పలువురికి ఇదే సంఘటన చోటు చేసుకోవడంతో ఏటీఎం వద్ద వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బంది వెంటనే ఏటీఎం సెంటర్‌ను మూసివేశారు

తాను ఏం చేయలేనని, బ్యాంకు అధికారులను సంప్రదించాలని కస్టమర్లకు టెక్నీషియన్ తెలిపాడు. దీంతో అతడితో కస్టమర్లకు వాగ్వాదానికి దిగారు. అయితే ఏటీఎంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకు అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: