జులై 2023

 కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి

భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్ట్) ధర్నా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)   

నంద్యాల జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ముందు కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితియానంద రాయి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు రాతపూర్వకంగా చెప్పారని,స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసిన నివేదిక ఇచ్చిందని,కడప ఉక్కు పరిశ్రమ స్థాపించడం సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని,రాష్ట్ర విభజన నేపథ్యంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం నేడు మాట మార్చడం పద్ధతి కాదని, బిజెపి రాష్ట్ర శాఖ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రాయలసీమకు ఉక్కుఫ్యాక్టరీ సాధిస్తామని చెప్పి ఏర్పాటు చేయకుండా రాయలసీమ నిరుద్యోగ యువత ఆశలను బిజెపి ప్రభుత్వం నాశనం చేసిందని,బిజెపి పార్టీకి మద్దతిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,ప్రతిపక్ష టిడిపి పార్టీ,జనసేన పార్టీలు ప్రశ్నించడంలో విఫలమయ్యాయని,2007లో బ్రాహ్మిని స్టీల్ పరిశ్రమకు ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారని,


2018 లో చంద్రబాబు నాయుడు రాయలసీమ స్టీల్ అథారిటీ కార్పొరేషన్ పేరుతో శంకుస్థాపన చేశారని,2019 లో హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ పేరుతో ఒకసారి,2023 లో జెఎస్డబ్ల్యు కంపెనీ పేరుతో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని, ప్రభుత్వానికి లాభదాయకం కానీ కడప ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కంపెనీలకు ఎలా లాభదాయకమవుతుందనివిభజన చట్టం ప్రకారము కడపలో ఉక్కు పరిశ్రమ, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం బీహెచ్ఈఎల్ టెక్స్టైల్ పార్కులు,కర్నూల్లో 400 కోట్లతో రైల్వే కోచ్ నిర్మాణ పరిశ్రమ,నంద్యాలలో డోన్ మైనింగ్ ఇన్స్టిట్యూషన్, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టులాంటి విభజన చట్టంలో ఉన్నా పది సంవత్సరాలు పూర్తయిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని కారణం కేంద్ర బిజెపి ప్రభుత్వం యొక్క విధానాలే కారణమని వెంటనే ప్రభుత్వ ఆధ్వరంలోనే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి గనులు కేటాయించి రాయలసీమ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం పార్టీగా కోరుతున్నామని లేని పక్షంలో ఉక్కుపరిశ్రమ సాధించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏసురత్నం,జిల్లా నాయకులు గౌస్, మస్తాన్వలి,రత్నమయ్య, శ్రీకాంత్, నాయకులు లక్ష్మణ్,రామచంద్రుడు,బాల వెంకట్,రామరాజు,నిరంజన్, భాస్కర్,మార్కు,సుబ్బారావు, కృష్ణా,హరి,సాయి తదితరులు పాల్గొన్నారు.

 పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

సిపిఐ నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఉన్న పద్మా నగర్ సొసైటీ లో జరుగుతున్న అవకతకతల ఆరోపణల పై సొసైటీని రద్దుచేసి జిల్లా అధికారులతో తిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని,పేదల ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 703 లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధర్యంలో పద్మావతి నగర్ భూములను పరిశీలిస్తూ ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాంమూర్తి, పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయుడు, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయుడు, నాయకులు హుస్సేన్ భాష, మాభాష పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లా అనంతరం ప్రైవేటు స్థలాలకు భూముల విలువ పెరిగిందని,ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ అధికార పార్టీ నాయకులు భూకబ్జాలు చేస్తున్నారని,అందులో భాగంగా 22 సంవత్సరాల కిందట ఏర్పడిన పద్మావతి నగర్ లో సొసైటీ కేవలం 8 మంది కమిటీ సభ్యలు1456 మంది సభ్యులతో కమిటీ ఏర్పడిందని,కానీ ఏనాడు కమిటీసభ్యుల సమావేశం నిర్వహించకుండా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలుగా జరుపుకున్నట్లు చేసుకొని కమిటీ సభ్యులు ఒకరికి తెలియకుండా ఇంకొకరికి రిజిస్టర్ చేసుకోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు.


పద్మావతి నగర్ ప్రధాన కాలువ కేసీ కెనాల్ పంట కాలువను కేసీ కెనాల్ అధికారుల అవినీతి వల్ల వాటిని మూసివేసి పెద్దపెద్ద భవనాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని,2003 వ సంవత్సరంలో సిపిఐ ఆధ్వర్యంలో భూస్వాములు ఆక్రమించిన సర్వేనెంబర్ 703 ప్రభుత్వ భూమిలో నిరుపేదలు భూ పోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుంటే అప్పటి కేసీ కెనాల్ అధికారులు వాటిని తొలగించి సర్వేనెంబర్ 703 లో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు పక్కా పట్టా ఇచ్చారని పట్టాలు తీసుకున్నవారు తిరిగి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.నంద్యాల పట్టణంలో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్న పోలీసు అధికారులు కానీ రెవిన్యూ అధికారు లు గాని నిమ్మకు నీరత్తినట్లు వివరిస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అనేక ఆరోపణలతో సొంత అన్నదమ్ముల ఆరోపణలతో నిండిన పద్మావతి సొసైటీని రద్దుచేసి జిల్లా అధికారులతో త్రిసభ్య కమిటీ 1456 మంది సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి నిజమైన లబ్ధిదారులకు పద్మావతి నగర్ భూములను పంచి ఇవ్వాలని పేదల ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 703 లోని ప్రభుత్వ భూమిలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఐ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం. కేసీ కెనాల్ కార్యాలయం.  ఎదుట రిలేనిరాహార దీక్షలు తోపాటు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని నాయకులు హెచ్చరించారు.

 పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన....

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపిఎస్) 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి (ఐపిఎస్) పాణ్యం నియోజకవర్గం లోని గడివేముల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని,స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సూచించిన అనంతరం స్టేషన్ లోని పలు కేసులపై విచారించి పెండింగ్ లో ఉన్న కేసులపై విచారణ త్వరగా చేపట్టి దర్యాప్తు ముగించి కోర్ట్ నందు చార్జిషీటు దాఖలు చేయాలని,మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులకు న్యాయం చేయాలని, మండల పరిధిలోని గ్రామాలలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని,రాత్రి సమయంలో గస్తిని పెంచాలని,పాత నేరస్తుల కదిలికలపై నిఘా ఉంచాలని,


అసాంఘిక కార్యక్రమాలైన జూదం, మట్కా,అక్రమ రేషన్ బియ్యం తరలింపు,నాటు సారాయి తయారీ, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని పూర్తిగా అరికట్టాలని,రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్యాక్షన్ పికెట్ పై ప్రత్యేక నీఘ ఉంచి గ్రామంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాచారం తెలుసుకొని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు,ఎ స్పీ సీసీ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 తెలంగాణలో కళ్ల కలక కేసుల కలకలం...భారీగా పెరుగుతున్న కేసులు


బారీ వర్షాలతో అతులాకుతలమైన తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క సరోజనీదేవి ఆసుపత్రికే రోజుకు ముప్పై నలభై మంది బాధితులు వస్తున్నారని వైద్యులు చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వైరస్ ఇన్ ఫెక్షన్లలో కళ్ల కలక కూడా ఒకటని అన్నారు. వర్షాల వల్ల గాలిలో తేమ, చెమ్మ కారణంగా వైరస్ లు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వ్యాపిస్తుంటాయని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్న బాధితులలో ఎక్కువ మందికి అడెనో వైరస్ వంటి ప్రత్యేక వైరస్ కారణమని పరీక్షల్లో తేలిందన్నారు.

వైరస్ వల్ల వచ్చే ఫోలిక్యులర్ కళ్ల కలకతో కంటి చూపునకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ సీజన్ లో కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. బయట నుంచి వచ్చాక గోరువెచ్చని నీటితో కళ్లు, ముఖం కడుక్కోవాలని సూచించారు. తీవ్రమైన కళ్ల కలక (ఎపిడమిక్ కెరటో కన్జంక్టివైటిస్) విషయంలో అప్రమత్తత అవసరమని డాక్టర్లు చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలంలో దృష్టి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కళ్ల కలక మరీ బాధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

కళ్లు ఎరుపెక్కడం, దురద, కాంతిని చూడలేకపోవడం, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలు కళ్ల కలక బాధితులలో కనిపిస్తాయని వైద్యులు చెప్పారు. ఇది అంటువ్యాధి అని, ఇంట్లో ఒకరికి సోకితే వెంటనే మిగతా వారికీ అంటుకుంటుందని హెచ్చరించారు. దురదగా ఉందని కళ్లు నలపడం, సొంత వైద్యం చేసుకోవడం చేయొద్దని, వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.


 నైతికవికాసానికి కథలేసోపానాలు

డోన్ పురపాలక సంఘం చైర్మన్ సప్తశైల రాజేశ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

విలువలు తరిగిపోతున్న నేటి ఆధునిక సమాజంలో బాల బాలికలు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడడానికి నైతిక విద్య ఎంతో అవసరమని, నీతి మార్గాన్ని బోధించే రామాయణ,భాగవత ఇతిహాసాలు పురాణాలు చదవడం,వినడం అందరికీ అత్యంత ఆవశ్యకమని డోన్ పురపాలక సంఘం చైర్మన్ సప్తశైల రాజేశ్ తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానము, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ సుధావిద్యాలయ లో జరిగిన"కథ చెబుతారా... ఊ... కొడతాం" కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కథలు, పంచతంత్రం కథలు విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని,  మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు చిన్నతనంలోనే నైతిక విలువలను పెంపొందించుకోవాలని ఫలితంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడ తారని పేర్కొన్నారు.


తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి  మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ విద్యార్థుల సర్వతోముఖ మానసిక వికాసానికై ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వాటిలో కథచెబుతారా..ఊ.. కొడతాం కార్యక్రమం ఒకటని, విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి విలువలుగల పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఎంతో తోడ్పడుతాయని అన్నారు. 10,15 సంవత్సరాల వయసు విద్యార్థుల విభాగంలో జరిగిన పోటీలలో జూనియర్ విభాగంలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాలను షేక్ జిజా మెహక్ అంజుమ్,బి.ప్రణవి, వై.శృతి మరియు సీనియర్ విభాగంలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాలను వరుసగా హేమంత్ నాయక్, డి.ఆయేషా,యు.తేజవర్ధన్ గెలుపొందారు.

ముగింపు కార్యక్రమంలో శ్రీ సుధా విద్యాలయ నిర్వాహకులు రాజ సుధాకర్ గుప్త మాట్లాడుతూ విద్యార్థుల్లో మరింత నైతిక విలువలు పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు వివేకానంద సేవా సమితి,తిరుమల తిరుపతి దేవస్థానము తరఫున ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విజేతలకు 1000/-,750/-, 500/- నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలనుండి 115 మంది విద్యార్థులు పాల్గొన్నారు.కార్యక్రమ న్యాయనిర్ణేతలుగా డాక్టర్ సురేశ్ బాబు,సర్వజ్ఞ మూర్తి,డాక్టర్ దేవేంద్రప్ప, సుబ్రహ్మణ్యం శెట్టి,నీలిమ,సీతామాలక్ష్మి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివేకానంద సేవాసమితి గౌరవ అధ్యక్షులు సప్తశైల తిమ్మయ్య,వ్యవస్థాపకులు జగన్మోహన్,ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ శ్రీనివాసులు శెట్టి, కోశాధికారి పి.వి.రంగయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ బైరెడ్డి సిదార్థ్  రెడ్డి


తనను ఎవరూ పట్టించుకోవడంలేదన్న కారణంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ధ్వజమెత్తారు. వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ ఆరోపణలను ఖండించారు. ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పవన్ వివాదాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శించారు. రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అసలు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ఆయనకు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదని సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీ పనైపోయిందని, అలాంటి పార్టీతో పొత్తులకు పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. 


 బండి సంజయ్ కు ఏపీలో కీలక పదవి అంటూ ప్రచారం


గత కొంతకాలంగా కమలం పార్టీలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు,బండి సంజయ్ స్థానంపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రకటించిన ఈ జాబితాలో దక్షిణాది నుంచి కేవలం బండి సంజయ్ కు మాత్రమే అవకాశం దక్కింది. మరోవైపు బండి సంజయ్ కు సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమించబోతున్నారనేదే ఆ ప్రచారం. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జీగా ఉన్న సునీల్ దేవధర్ ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఆయన స్థానంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జీగా మరో నాయకుడిని నియమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమిస్తే... వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ బలం పెరుగుతుందనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.

 బాబు...జగన్ కేంద్రానికి దాసోహం అయ్యారు...ఉండవల్లి అరుణ్ కుమార్


కేంద్రంలోని మోడీ సర్కార్ కు  టీడీపీ, వైసీపీ పార్టీలు దాసోహం అయ్యాయని  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. ఈ రెండు  బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రాజమండ్రిలో మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు... బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. మోదీకి జగన్ దాసోహం కావడం మంచిది కాదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఎన్నికలకు ముందు అయినా మాట్లాడాలని సూచించారు.

ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు అవుతున్నా విభజన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం పెడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి పెంచాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేయాలని అన్నారు. ‘‘అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు.

కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి మండిపడ్డారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అంటున్నారని, అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడబోమని ఎందుకు అంటున్నారని నిలదీశారు. 

 ఇటీవల చర్చనీయాంశమైన వాలంటీర్ల వ్యవస్థపైనా ఉండవల్లి స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళితే... ఆ వ్యవస్థ రద్దు అవుతుందని చెప్పారు. టీడీపీ, జనసేన ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు.

 సోనూ సూద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అపన్నల హస్తంగా పేరు గాంచిన ప్రముఖ నటుడు, దాత సోనూ సూద్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సోనూ సూద్ అసలుసిసలైన ఆపద్బాంధవుడు అంటూ కొనియాడారు. దయ, ఉదార స్వభావంతో ప్రభావితం చేయడమే కాకుండా, లెక్కలేనంత మంది జీవితాలను మార్చివేశాడని చంద్రబాబు కీర్తించారు.  "జీవన సాఫల్యం దిశగా మీకు అత్యద్భుతమైన ఆరోగ్యం సమకూరాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు తలపెట్టే పనుల్లో హద్దుల్లేని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు కోసం మీ నిరంతర ప్రయత్నాలు ఇకపైనా కొనసాగాలి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ ట్రైన్లు రద్దు

కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్‌ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇటీవల వచ్చిన వరదలు, మూడో లైను నిర్మాణ పనుల కారణంగా మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు ట్రైన్లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఆ ట్రైన్లను తాజాగా ఆగస్టు 6వ తేదీ వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపారు.

రద్దైన ట్రైన్లలో కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ పుష్‌పుల్‌ రైలు (ట్రైన్ నెంబర్ 07753/54), సికింద్రాబాద్‌-వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌ (ట్రైన్ నెంబర్ 07462/63), కాజీపేట- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే రామగిరి ఎక్స్‌ప్రెస్‌ ( ట్రైన్ నెంబర్ 17003/4), కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ (17035/36), భద్రాచలం రోడ్‌- బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్ 17033/34) ట్రైనును వచ్చే నెల 6 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ ట్రైన్ ప్రయాణికులకు కూడా రైల్వేశాఖ చేదువార్త చెప్పింది. వారం పాటు 22 పలు ట్రైన్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల నేపథ్యంలో ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 31 నుంచి వచ్చే ఆగస్టు 6 వరకు.. సంబంధిత రైళ్ల రద్దు ఉంటుందని పేర్కొన్నారు. రద్దైన ట్రైన్లలో లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే 12ఎంఎంటీఎస్  ట్రైన్లు ఉన్నాయి. ఉందానగర్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడిచే మరో 10 ఎంఎంటీఎస్‌లు కూడా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.


 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో.... 

భారత మాజి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళులు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో భారత మాజీరాష్ట్రపతి, అణుశాస్త్రవేత్త, మిస్సైల్ మాన్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన


అనంతరం  నడిగడ్డలోని స్థానిక మాస్టర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి  శిబిరంలో దాదాపు 100 మందికి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి,బిపి,షుగర్ ఉచిత పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కోశాధికారి నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష, తేలకపల్లి చైతన్య, నంద్యాల మండల సబ్ బ్రాంచ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ సోహెల్, డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు


 

 వర్షాల ప్రభావం... తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల నేపథ్యంలో వరదలు సంభవిస్తుండడంతో ప్రజలు ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీపైనా వర్షాల ప్రభావం పడింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల వెంకన్నను నిన్న 74,268 మంది దర్శించుకున్నారు. 26,817 మంది తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే హుండీ ద్వారా రూ.4.32 కోట్ల ఆదాయం లభించింది.

 ప్రజల సంక్షేమానికే..... జగనన్న సురక్ష

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు  ప్రజాలందరూ సంక్షేమ పథకాలు పొందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 11 రకాల   పత్రాలు మంజూరు చేస్తున్నారని అధికారులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తెలిపారు.


గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి ఎర్రగుడి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించి అర్హులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి


నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందకుండా ఉంటే  వాలంటీర్లును సంప్రదించి వారి ద్వారా వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుకోవచ్చని, ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని పొందే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు ద్వారం శ్రీకాంత్ రెడ్డి,సిరూప శ్రీనివాస రెడ్డి, గడివేముల తహసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప, పంచాయతీ సెక్రెటరీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు


హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ బైక్ పై వెళ్తున్న ఇద్దరు కొట్టుకుపోయారు. అయితే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కాపాడారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట వాగు భారీగా ప్రవహిస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆ వాగును దాటే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ధాటికి ఆటో వాగులో కొట్టుకుపోయింది. ఆటో డ్రైవర్ వెంటనే బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. 

మరోవైపు, హంటర్ రోడ్డులోని ఓ గర్ల్స్ హాస్టల్ నీట మునిగింది. హాస్టల్లో 200 మంది వరకు విద్యార్థినులు చిక్కుకున్నారు. అర్ధరాత్రి ఒకటి గంట నుండి వారు హాస్టల్ బిల్డింగ్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద నీటిని తోడివేయడానికి బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడేం జరిగినా రంగంలోకి దిగడానికి అందుబాటులో రెండు హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటిమట్టం 53 అడుగుల వరకు వెళ్తే మూడో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత వరద కాస్త శాంతించిం

no image

 ఈ రహదారికి మోక్షం కల్పించండి

సిపిఐ(యంయల్)ఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్


(జానో జాగోో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

పేరుగొప్ప వూరు దిబ్బ అన్న చందంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని సిరివెళ్ళ నుండి నర్సాపురం గ్రామానికి వెళ్లే వరకు రహదారి అస్తవ్యస్తంగా తయారై ప్రయాణాలు కొనసాగించడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ (యంయల్ )ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ విమర్శించారు. ఈ సందర్భంగా సిరివెళ్ళ, రుద్రవరం రహదారి లో రవిరాజ్ మాట్లాడుతూ ఆళ్ళగడ్డ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందడుగులో ఉందని చెప్తున్న నాయకులకు ఈరహదారిలో వెళ్లే ప్రయాణికుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.సిరివెళ్ళ నుండి నర్సాపురం వరకు ప్రయాణాలు కొనసాగించాలంటే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని, నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు యసి కాలనీలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన వర్షపు నీరు ఇండ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు,నాయకులు స్పందించి సిరివెళ్ల నుండి నర్సాపురం రహదారిని బాగు చేసి, ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు..

 ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది,,,పురందేశ్వరి


ఏపీ బీజేపీ చీఫ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పురందేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. "ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిధుల మళ్లింపును నిర్మల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం విచక్షణ రహితంగా అప్పులు చేసి, ఆ భారాన్ని రాష్ట్రంపై, ప్రజలపై మోపుతున్న వైనాన్ని ఆమెకు వివరించాను. నిర్మలా సీతారామన్ ను నేను కలిసిన ఉద్దేశం నెరవేరింది" అని పురందేశ్వరి పేర్కొన్నారు.

 సినీ కార్మికులకు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నారు


సినిమా అంటే హీరో ఒక్కడే కాదని, సినిమా బడ్జెట్లో అత్యధిక భాగం హీరోల పారితోషికాలకే వెళుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సినిమా హీరోల పారితోషికాలపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సల్మాన్ ఖాన్ తదితర పెద్ద హీరోలు ఒక సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోందని, ఓ సినిమా బడ్జెట్లో మూడో వంతు ఇలా హీరోలకు పారితోషికం ఇచ్చేందుకే సరిపోతోందని వెల్లడించారు.  భారత చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల మంది కార్మికులు ఉంటారని, వారికి మాత్రం నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం తనవంతు చర్యలు తీసుకోవాలని కేంద్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు విజ్ఞప్తి చేశారు. సినిమా బడ్జెట్లో అధికభాగాన్ని రెమ్యూనరేషన్ రూపంలో హీరోలకు అందించే పరిస్థితులను మార్చాలని, ఆ మేరకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

 జగనన్న దానకర్ణుడు అయితే చంద్రబాబు కుంభకర్ణుడు


జగనన్న దానకర్ణుడు అయితే చంద్రబాబు కుంభకర్ణుడని మంత్రి రోజా అన్నారు. ఆమె గురువారం పుత్తూరు మున్సిపాలిటీలోని గోవిందపాళ్ళెం, పిళ్ళారిపట్టు, దాసరిగుంట సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పుత్తూరును మున్సిపాలిటీగా మార్చి నాడు టీడీపీ ప్రజలపై పన్నుల భారం వేసిందన్నారు. జగన్ చిన్నవయసులోనే తండ్రికి మించిన తనయుడుగా ప్రజాదరణ పొందుతున్నారని కితాబునిచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. నాడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చారన్నారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే అన్నారు.

చంద్రబాబుది మాత్రం 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ మాత్రం కాదన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం వంటి ప్రజలకి ఉపయోగపడే పథకాలను చంద్రబాబు తన పాలనలో ఎందుకు తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. ఈ రోజు రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు దానిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. 

తాను సూటిగా అడుగుతున్నానని, రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జుర నాయుడివా? లేక నువ్వు దాన కర్ణుడువా? సింగపూర్ వాళ్లకు ఎలా దోచిపెట్టావు? రైతుల నుండి రాజధానికి ఎలా లాక్కున్నావు? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ పాలనలో గంజాయి పంట సాగు చేస్తున్నారనడం విడ్డూరమన్నారు. 

ముమ్మాటికి చంద్రబాబు నోరు పురుగులు పట్టడం ఖాయమని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో నాటి మాజీ మంత్రి గంటా.. గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారని స్వయంగా తానే చెప్పాడని, పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండుసార్లు దొరికాన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ గంజాయి సాగును ఉక్కుపాదంతో అణచివేస్తున్నారన్నారు. గంజాయి మాఫియా వెన్నులో వణుకు పుట్టించారన్నారు. జగన్ 17 మెడికల్ కాలేజీ లు రాష్ట్రానికి తీసుకు వచ్చారన్నారు. పుత్తూరు - నగరి మధ్య ఫోర్ లైన్ జాతీయ రహదారి పనులు అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోజా భర్త ఆర్కే సెల్వామణి వచ్చారు.

 మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లే


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కాస్త ఊరట కల్పించే వార్తను చెప్పింది. వర్షాలు ఇక తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేటి ఉదయం బలహీనపడిందని, మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని చెప్పారు. తెలంగాణలో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా నమోదయినట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో అసాధారణ భారీ వర్షాలు కురిశాయన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని, అయితే ఆగస్ట్ రెండో వారంలో, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. గురు, శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అయితే ఆ తర్వాత మూడు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవన్నారు.


 దేశంలో నెంబర్ వన్ పోలిసింగ్ వ్యవస్థ ఏం చేస్తోంది


ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత మూడేళ్లలో అదృశ్యమైన మహిళలు, బాలికల గణాంకాలను కేంద్రం బుధవారం వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వుమెన్ ట్రాఫికింగ్ వార్తలు కలకలం రేపాయి. తెలంగాణలో మిస్సైన మహిళలు, బాలికల గణాంకాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణేలేదని, కంటికి కనపడకుండా పోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్ లో మొద్దు నిద్ర పోతున్నాడని, రెండేళ్లలోనే 34,495 మంది మహిళలు, 8,066 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే... కేసీఆర్ ఇందుకు తలదించుకోవాలని మండిపడ్డారు. 

మహిళల భద్రతకు పెద్దపీట అని చెప్పుకున్నందుకు సిగ్గుపడాలన్నారు. ఆడవారి పట్ల వివక్ష చూపే ఈ బందిపోట్ల పాలనలో కనీసం మిస్సింగ్ కేసులు నమోదైనా దర్యాప్తు శూన్యమన్నారు. కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ ఆడబిడ్డలకు లేదన్నారు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పే తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ... మహిళలు మాయమవుతుంటే దొరకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థ దొర లెక్కనే నిద్ర పోతోందన్నారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో కనీసం 1% కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదన్నారు. దొరకు ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే మిస్సింగ్ కేసులపై దర్యాప్తు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తక్షణం తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ కనిపెట్టాలన్నారు.

 అట్టహాసంగా ప్రారంభమైన.....మొహరం వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేములలో మొహరం పండుగ వేడుకలను గడివేముల గ్రామానికి చెందిన సాదయ్య కుమారులు రామ గోవిందయ్య, రామాచారి మరియు గ్రామంలోని ఆచారుల కుటుంబ సభ్యుల సమేతంగా అత్యంత భక్తి భావంతో పూజించే హసేన్ మరియు హుస్సేన్ పీర్లకు మేళ్ళ తాళాల మధ్య పూల సూచికలను అత్యంత భక్తి భావంతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా పీర్ల చావడి నిర్వాహకులు రహంతుల్లా మాట్లాడుతూ ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకునే మొహరం పండుగను కుల, మతాలకు ఆతీతంగా సోదరభావంతో హిందువులు మరియు ముస్లింలు ఎంతో పవిత్రంగా,భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని, గడివేముల గ్రామంలోని ప్రజలందరూ ఐకమత్యంతో ప్రజలందరం అన్నదమ్ములలా కలిసిమెలిసి జరుపుకునేందుకు సహకరించాలని మనవి చేశారు.


 ఇస్లామ్ వెలుగు అందరికోసం

ఇస్లామ్ వెలుగు... ఈ పుస్తకంలోని కథనాలు కేవలం ధార్మికత చింతనను మాత్రమే వివరించలేదు. ప్రతీ వ్యాసంలో సామాజిక వ్యవహార సరళి ఎలా ఉండాలో తెలియజేసే విలువల వాచకమని చెప్పవచ్చు. జీవన విధానాన్ని విడమర్చి చెప్పే గ్రంథమే ఇస్లామ్ వెలుగు పుస్తకం. 

ఇస్లామ్ అందరి ధర్మమని చెప్పే ప్రయత్నమే : ముహమ్మద్ ముజాహిద్

తెలుగులో ఇస్లామ్ సాహిత్యాన్ని అత్యంత సులువుగా చదువుకోగలిగేలా రాయదగ్గవారిలో ముహమ్మద్ ముజాహిద్ పేరు ముందువరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పలు పత్రికల్లో అచ్చయిన వ్యాసాల  సంకలనం ‘ఇస్లామ్ వెలుగు’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. 

ఖుర్ఆన్, ప్రవక్త బోధనల్ని తేట తెలుగులో విశ్లేషించి రాయడంలో ముజాహిద్ ది అందెవేసిన చెయ్యి. ఆయన వ్యాసాలు చదివితే ఇస్లామ్ ధర్మ బోధనలు కేవలం ముస్లిములకే కాదు అందరి కోసం అనే ఆలోచన కలిగిస్తాయి. ఇప్పటి వరకూ తెలుగులో వస్తున్న ఇస్లామ్ సాహిత్యానికి కాస్తంత భిన్నంగా రాయడం అలవర్చుకున్న ముజాహిద్ రచనలు అనతికాలంలోనే పాఠకాదరణ పొందాయి. ఆదరణతోపాటు ఎంతోమందిని శత్రువులనీ సంపాదించిపెట్టాయి. అందరికీ అర్థం కాకుండా గ్రాంధిక భాషలో రాయడం వల్ల ఒరిగేదేముంది. ఖుర్ఆన్ గ్రంథం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ గ్రంథ బోధనలు ప్రతీ గుండె వరకూ చేరాలన్న ప్రవక్త ఆదేశమే ముజాహిద్ రచనలకు ప్రేరణ అని చెబుతారాయన. ఇస్లామ్ లోని జీవన విధానం అందిరికీ బోధపడాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారాయన. 


పుస్తకానికి ప్రేరణ ఇలా...

నేను ప్రతీ వారం ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఇస్లామ్ సందేశం శీర్షికన వ్యాసాలు అందించేవాడిని. వారం వారం వచ్చే కథనాలకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చేది. కులమతాల కతీతంగా నా వ్యాసాలను చదివేవారని నాకప్పుడు అర్థమయింది. ఇస్లామ్ లో తల్లిదండ్రుల హక్కులు, సామాజిక వ్యవహార సరళి, ఇలా ఎన్నో అంశాలపై ఖుర్ఆన్ సందేశాన్ని జోడించి రాసే వ్యాసాలకు ఎంతోమంది నుంచి ప్రశంసలందుకునేవాడిని. ఒకరోజు వెంకట్రామయ్య అనే పేరుగల ఓ రిటైర్డు ఇంజనీరు నాకు ఫోన్ చేసి ‘బాబూ మీ ఫోన్ నెంబరు అతి కష్టం మీద సంపాదించాను. ఎంతోకాలంగా మీ వ్యాసాలు చదువుతున్నాను. ఈ వ్యాసాలన్నీ సంకలనం చేసి ఒక గ్రంథంగా తీసుకురండి’ అని చెప్పాడు. అప్పటిదాకా నాకా ఆలోచన కూడా రాలేదు. ఆ తరువాత అడపాదడపా చాలామంది ఫోన్ చేసి చెప్పడంతో పుస్తకం తీసుకురావాలని సంకల్పం చేసుకున్నాను. కానీ పుస్తక ముద్రణ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. లాక్ డౌన్ లో అల్లాహ్ పేరుతో పుస్తక ప్రచురణ పనులు ప్రారంభించాను. తెలిసిన శ్రేయోభిలాషులతో చర్చించాను. సానుకూలత వచ్చింది. అందరి సాకారంతో పుస్తక ముద్రణ పూర్తయింది. ఆరు నెలల్లోనే మూడుసార్లు ముద్రణ జరగడాన్ని నమ్మలేకపోయాను. ప్రజల్లో ఇస్లామ్ వెలుగులు విరజిమ్మడంలో నా వంతు కృషి చేశాను. అల్లాహ్ నాపై చూపిన కారుణ్యానికి చిహ్నంగా భావిస్తున్నాను. 

ఇందులో ఉన్న ప్రతీ వ్యాసం పేజీ, పేజినర్నరకు మించి ఉండవు కానీ, ఎంతో భావార్థంతో కూడుకున్నవని చాలామంది సీనియర్ రచయితలు, మిత్రులు చెబుతుంటే చాలా సంతృప్తి కలుగుతుంది. ఇస్లామ్ వెలుగు పుస్తకం నా పరలోక సాఫల్యానికి తోడ్పడుతుందని భావిస్తున్నాను. 

 పాఠశాల సముదాయ శిక్షణ తరగతులు ప్రారంభం 

ఎంఈఓ విమల వసుందర దేవి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం గడివేముల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న నాలుగు పాఠశాల సముదాయాల యందు రెండు రోజులు పాటు విద్యార్థులకు బోధించే శిక్షణా తరగతులపై శిక్షణ ఇస్తున్నట్లు ఎంఈఓ విమల సుందర దేవి తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడివేముల యందు 50 శాతం మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు నేడు మరియు మిగిలిన 50 శాతం మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు రేపు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడిగరేవుల నందు నేడు తెలుగు మరియు రేపు హిందీ సబ్జెక్టు నందు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరిమద్దుల పాఠశాల నందు నేడు లెక్కలు మరియు రేపు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గని నందు నేడు బయాలజీ రేపు సోషల్ స్టడీస్ సబ్జెక్టు నందు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గడివేముల ఎంఈఓ వసుంధర విమల వసుంధర దేవి  తెలిపారు.

 


 నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో... 

స్పందన అర్జీదారులకు అన్నదాన కార్యక్రమం

(జానో జాగో వెెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతు తమకు న్యాయం జరగాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ను ఆశ్రయించి విచ్చేయుచున్న ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన స్పందన కార్యక్రమం కి ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కలెక్టర్ డాక్టర్ మనజీల్ జిలాని ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి విచ్చేయుచున్న అర్జీదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులకు ప్రముఖ వైద్యులు ఇండస్ హాస్పిటల్ డాక్టర్ జహంగీర్  సహకారంతో జిల్లా మహిళా అధికారిణులు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసిరున్నిసా బేగం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చింతామణి, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ లక్ష్మీదేవి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ముఖ్య అతిథులుగా హాజరై 200 మంది స్పందన కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారులకు అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజు నాయక్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.


 బిఆర్ఎస్ నేత పెండ్యాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో...

ఘనంగా కేటీఆర్ జన్మదినోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చార్మినార్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటెస్టెడ్ కార్పొరేటర్ పెండ్యాల లక్ష్మణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెండ్యాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో చార్మినార్ వద్దభాగ్యలక్ష్మి ఆలయంలో ఈరోజు ఉదయం కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చార్మినార్ వద్ద కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు జరుపుకున్నారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ పుస్తే శ్రీకాంత్, బిఆర్ఎస్ నాయకులు కే సుదర్శన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష గోపి గౌడ్, దిగంబర్ బాసి తల్లి రాజేష్ ప్రణయ్ కుమార్ , అమిత్ అగర్వాల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. 


 నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మహిళను ఢీ కొట్టిన లారీ

తీవ్రంగా గాయపడిన మహిళా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మహిళను లారీ ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయాలపాల్సంది. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామానికి చెందిన జెల్ల నాగ లక్ష్మమ్మ,(60) గ్రామంలోని వడ్డే రామచంద్రుడు ఇంటి ముందర కొల్లాయి నీళ్లు పట్టుకొనుటకు బిందె తీసుకోని రోడ్డుకు ఎడమ వైపు నడుచుకుంటూ వెళ్ళు తుండగా జిందాల్ సిమెంట్ ఫాక్టరీ నుండి సిమెంట్ ని తీసుకెళుతున్న TN 31 BL 8754 నెంబర్ లారీ డ్రైవర్ ఏ.ఇలియరజా లారీని అతివేగంగా,


ఆజాగ్రత్తగా,హరన్ కొట్టకుండా నడుపుతూ జల్ల లక్ష్మీదేవిని ఢీకొట్టగా ఆమెకు రెండు కాళ్లు విరిగి తీవ్రరక్త స్రావం జరిగి నరాలు వెలడుతూ వున్నయని  ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల హాస్పిటల్ కు తరలించామని, నంద్యాల హాస్పిటల్ లో చికిత్స పొందుతుందని చిందుకూరు గ్రామానికి చెందిన బింగి నాగరాజు( 55) వచ్చి తెలిపిన వివరాల మేరకు గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 జల్పల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్ లో జరిగిన...

బోనాల మహోత్సవంలో పాల్గొన్న యువ నాయకులు కార్తీక్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

పహాడీ షరీఫ్ లోని   పోచమ్మ దేవాలయంలో జరిగిన అమ్మ వారి  బోనాల ఉత్సవాలలో పాల్గొని  తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ శ్రీ. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


యంజాల శ్రీధర్ కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికి మేలు జరుగాలని,  కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కంటి సమస్యలపై వైద్య సలహా తప్పనిసరి

సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు కోరారు. గురువారం పురాని హవేలీ లోని సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జనహిత సేవా ట్రస్ట్  సహకారంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కే వేణుగోపాలరావు మాట్లాడుతూ


తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు ఇటువంటి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ పూర్ణచందర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ మహమూనా, డాక్టర్ రమ్యా ప్రియా, సరిత, సెట్విన్ సూపరింటెండెంట్ పెండ్యాల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.