బీజేపీని వదిలే ప్రసక్తే లేదు...,డీ.కే. అరుణ

తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టతనిచ్చారు. ఓ తెలుగు న్యూస్ పేపర్లో ఈ వార్తలు వస్తున్నాయని, ఆ పేపర్ ఎవరి కనుసన్నల్లో నడుస్తోందో అందరికీ తెలుసని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలతో పాత్రికేయ విలువలు పతనం అవుతున్నాయని విమర్శించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని, తాను బీజేపీలోనే ఉంటానని డీకే అరుణ వెల్లడించారు.  తనపై బీజేపీ ఎంతో నమ్మకం ఉంచి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని, అలాంటప్పుడు తాను పార్టీని వదిలి ఎందుకు వెళ్లిపోతానని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు. డీకే అరుణ 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: