పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా పాఠ్యపుస్తకాల పంపిణీ

విద్యార్థుల కోసం కేసీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా మొదటి రోజున హాజరైన విద్యార్థులకు స్వాగతం పలికి అభినందించారు. నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు పలకలు పంపిణీ చేసి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందివ్వాలని తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు..నోటు పుస్తకాలకు  60 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేయగా ఈ విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్ ను ఈ నెల 20 న జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు.

రూపాయలు 35 కోట్లతో ఉదయం పూట విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నట్లు తెలిపారు..పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్స్ బుక్స్ ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, ఇది ఎంతో గొప్ప విషయం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని రావిర్యాల లో బడి బాటలో కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఉచిత నోట్ పుస్తకాల  నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్ బుక్స్ ను, నోటు పుస్తకాలను ఈ నెల 20 విద్యా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్ ను కూడా విద్యా దినోత్సవం నాడు అందివ్వనున్నట్లు తెలిపారు

మన ఊరు -  మనబడి కార్యక్రమంలో  భాగంగా 12 విభాగాల్లో  పనులు పూర్తి అయిన 1000 పాఠశాలలను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. హరితహారంలో భాగంగా పాఠశాలల వద్ద మొక్కలు నాటలన్నరు. గుడి లాగే బడీని చూడాలన్నారు .స్థానిక సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. తొలి మెట్టు కార్యక్రమం ద్వారా చదువులో వెనుక బడ్డ విద్యార్థులకు వారికి సులువుగా అర్థం అయ్యేలా  బోధిస్తున్నట్లు తెలిపారు. ప్రయివేటు కన్నా క్వాలిఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవటానికి ఇంగ్లీష్ మీడియం కారణం అవటంతో పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు పోటీ పడేలా ఉండాలని గత సంవత్సరం నుండి 1 నుండి 8వ తరగతుల వరకు ఇంగ్లీష్ బోధన ప్రారంభించినట్లు, ఈ సంవత్సరం 9 వ తరగతి వరకు బోధించనున్నట్లు తెలిపారు. ఏ ఆటంకం లేకుండా ఈ విద్యా సంవత్సరం కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: