అమరుల త్యాగ ఫలం.....కేసీఆర్ పోరాట ఫలితం..తెలంగాణ రాష్ట్రం

తొమ్మిది ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించిన తెలంగాణ

అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

అమర వీరుల త్యాగ ఫలం.....కేసీఆర్ పోరాట ఫలితం నేడు మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి పాలల్లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం... ప్రత్యేక రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగింది.


సరూర్ నగర్ స్టేడియం వద్ద అమరవీరుల స్థూపానికి  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. దీంతోపాటు కొంగర కలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధిలో,పారిశ్రామికరణలో రంగారెడ్డి ముందంజలో ఉందని,

యువతకు భారీగా ఉద్యోగాలు లభించడంతోపాటు. అన్ని రంగాల్లో మన రంగారెడ్డి జిల్లా ముందుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 9 ఏళ్లలో రంగారెడ్డి జిల్లా సాధించిన ప్రగతి నివేదికతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మంత్రి ప్రసంగంలో    పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీష్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రతిక్ జైన్, తిరుపతి రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, అమరులు శ్రీకాంతచారి మాతృమూర్తి శంకరమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: