ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం,,,,అప్సర కేసులో ఊహించని ట్విస్ట్

హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర (30) మర్డర్ కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసి ఆపై మ్యాన్‌హోల్‌లో పడేసి పూడ్చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు.. ఆమె తల్లితో కలిసి అప్సర కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అప్సరను పూజారే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

అయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. చైన్నైకి చెందిన అప్సర తల్లితో కలిసి ఏడాది క్రితం నగరానికి వచ్చింది. ఆమె టెంపుల్‌కు వెళ్లే క్రమంలో అక్కడే పూజారిగా ఉన్న సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణను తనను కూడా పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తడి తేవటంతోనే తాను చంపేసినట్లు పూజారి ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. అప్సరకు చెన్నైలో ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. అతనితో ఆమె చాలా సన్నిహితంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అతడి వల్లే ఆమె గర్భం దాల్చిందని.. ఆపై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందన్నాడు. లేదంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హత్య చేయాల్సి వచ్చిందన్నాడు.

ఇదిలా ఉండగానే.. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. చైన్నైలో ఉన్నప్పుడే ఆమెకు పెళ్లి జరిగినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే అతడు ఎవరు ? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇలా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

టెంపుల్ కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగినట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది. సాయికృష్ణ తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు. గతేడాది నవంబర్‌లో అప్సరను పూజారి సాయికృష్ణ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడికి తీసుకెళ్లాడు. గుజరాత్ టూర్‌ తర్వాత వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. దీంతో అప్సర వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. అయితే తనకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని పెళ్లి చేసుకోలేనని సాయికృష్ణ ఆమెకు చెప్పటంతో ఫోటోలు బయటపెట్టి రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో.. ఎలాగైనా అప్సరను చంపేయాలని సాయికృష్ణ నిర్ణయం తీసుకున్నాడు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: