మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో

పలు అభివృద్ధి  పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేస్తూ  పలు కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు నిధుల వరదలావచ్చాయి. తాజాగా  సీఎం కేసీఆర్ రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్,  మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం  చుట్టారు. ఒక ప్రత్యేక విజన్ తో కార్పొరేషన్ సమగ్రాభివృద్ధి. చేస్తూ ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.


పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్,వైకుంఠ దామాల నిర్మాణం చేపట్టి స్వచ్ఛతకు చిరునామాలుగా మునిసిపాలిటీలు,  కార్పొరేషన్లు.పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 1200 కోట్లతో నాళాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో,  రూ. 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని మంత్న్నారి అన్నారు.  తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని. గుర్రం గూడ,కూర్మల్ గూడ,జిల్లెల గూడ,బడంగ్ పేట్ ల వద్ద రిజర్వాయర్లు పనులు జరుగుతున్నాయన్నారు.

నియోజకవర్గంలో బడంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి ల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.  బడంగ్ పేట్,మీర్ పేట్, జల్ పల్లి ,  తుక్కుగూడ కార్పొరేషన్లు,  మునిసిపాలిటీలకు 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.  ఎల్ బి నగర్ ప్రాంతంలో నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లతో పాటు,నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు .9 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఊహాలకందని అభివృద్ధి జరిగిందని, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాలు, 24 గంటల విద్యుత్ లాంటి మైలు రాళ్లు అందుకుందన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలోతో భారీగా పెట్టుబడులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.


మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ 1వ వార్డు మైత్రిపురం కాలనీలో 50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు,21 వార్డులో న్యూ వెంకటేశ్వర కాలనిలో,గాయత్రి హోమ్స్ కాలనిలో 50 లక్షలతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా  మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలాలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్,  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,  పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి,  పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భుపేష్,  కార్పొరేటర్ సిద్రాల లావణ్య , పలు డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.










Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: