పార్టీలో కష్టపడి పనిచేసేవారికిి తప్పకుండా గుర్తింపు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
బీజేపీ కి గుడ్ బై చెప్పి... మంత్రి సబితమ్మ కు జై కొట్టిన కమలం నేతలు
బీఆర్ఎస్ లో చేరిన పడమటి తాండ కు చెందిన బీజేపీ నాయకులు
బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
పార్టీలో కష్టపడిపనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉటుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలం పడమటి తాండ కు చెందిన బీజేపీ పార్టీకి చెందిన నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. మండల పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, సర్పంచ్ అనిత రవి, లింగ్యా నాయక్, రాములు నాయక్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆదివారం నాడు మీర్ పేట్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ
దక్షిణాది లో బీజేపీ పూర్తిగా లేకుండా పోయిందని, తెలంగాణ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే వుందని నమ్మి,మహేశ్వరం నియోజకవర్గంలో అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అనుక్షణం ప్రజాసేవ చేస్తున్న మంత్రి సబితమ్మ కు అండగా ఉండటానికి బి ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. వారందరికీ పార్టీలోకి స్వాగతం పలికిన మంత్రి బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే రాష్టం సస్యశ్యామలం అవుతుందన్నారు. పార్టీలో కష్ట పడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు.
Home
Unlabelled
పార్టీలో కష్టపడి పనిచేసేవారికిి తప్పకుండా గుర్తింపు,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి,, బీజేపీ కి గుడ్ బై చెప్పి... మంత్రి సబితమ్మ కు జై కొట్టిన కమలం నేతలు,,, బీఆర్ఎస్ లో చేరిన పడమటి తాండ కు చెందిన బీజేపీ నాయకులు ,,, బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: