అబ్బురపరిచేలా ఊరూరా చెరువుల పండుగ

మీర్ పేట్ చందనం చెరువు వద్ద కళాకారుల కోలాహలం

ప్రియతమ నేత మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలుకూత

తెలంగాణ వైభవాన్ని చాటిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

బోనాలతో మహిళలు....పోతరాజుల విన్యాసాలు......బాణసంచా పేలుళ్లు....,విద్యుత్ కాంతులతో జిగేల్ జిగేల్ మంటూ చందనం చెరువు.....డప్పు కళాకారుల విన్యాసాలు....ఒగ్గు కళాకారుల పాటలతో....,బతుకమ్మలు ఆడుతూ మహిళలు, తెలంగాణ ఉద్యమ పాటలకు ఉర్రుతలుగుతూ యువత ఆట పాటలతో చందనం చెరువుతో  పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి..


తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా మీర్ పేట్ చందనం చెరువు వద్ద కోలాహలం నెలకొంది...చందనం చెరువు ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో జరిగిన  కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు..


మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీతతో జలకళతో నిండుకుండల మారిన చెరువుల వద్ద నిజమైన పండుగకు నిదర్శనంగా గొప్ప దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మహేశ్వరం నియోజకవర్గములో మంత్రి సబితమ్మ చేపట్టిన గొలుసుకట్టు చెరువుల సుందరికరణ కార్యక్రమం ఉందన్నారు.


చందనం చెరువు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో రంగాన్ని ఎంచుకొని బాగు చేస్తున్నారన్నారు..


నాడు తెలంగాణ పదం వాడలంటే భయ పడేవారని. నేడు తెలంగాణ భాషలో సినిమాలు వస్తున్నాయని, హీరోలు కూడా మన ప్రాంత భాషలో మాట్లాడుతూన్నారని అన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజల విజయం అన్నారు. నాడు నీరు దొరకక బకెట్లలో బతుకమ్మలు విడిచేవారని నేడు నిండిన చెరువులు, కుంటలు, ప్రోజెక్టులలో బతుకమ్మలు వదులుతున్నారన్నారు. విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ ఆడేలా  ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేసారని, బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ములు అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. 2014 కు ముందు చెరువులు ఎట్లుండేవి. ఇప్పుడు ఎట్లా మరాయో చూడాలని, నాడు పిచ్చి మొక్కలతో ఎండి నీరు లేక వేలవేలపోయేవని, భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండి పోయేవని,మోటార్లు కాలిపోయేవని,

నేడు ఎర్రటి ఎండలో నిండు కుండాల మరాయన్నారు. ఒక ప్రత్యేక విజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 27 వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు అవి నేడు సత్పలితాలు ఇచ్చాయన్నారు. గొలుసుకట్టు చెరువుల నింపటానికి, ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ను నిర్మించారన్నారు....చెరువుల్లో వదిలిన చేపలతో నేడు ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్,  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,  ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భుపేష్, మాజీ ఎంపీపీ లావణ్య, కార్పొరేటర్లు, ఆర్ డి ఓ సూరజ్ కుమార్, తహసీల్దార్ జనార్దన్,  కమిషనర్ నాగేశ్వర్,పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: