బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతించిన
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతా రావు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
మృగశిర కార్తె సందర్బంగా ప్రతి సంవత్సరం దీర్ఘకాలంగా ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణి చేస్తున్న బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షులు,మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9వ తేదీన చేప ప్రసాదం పంపిణి సందర్బంగా మంగళవారం హన్మంతరావు పాతబస్తీ దూద్ బౌలి లోని బత్తిన సోదరులు ఉంటున్న నివాసానికి టీపీసీసీ ఫిషెర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్,కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్ తదితరులతో కలిసి వెళ్లి చేప ప్రసాదం తయారు చేసే విధానాన్ని పంపిణి వివరాలను బత్తిన కుటుంబ సభ్యులైన గౌరీ శంకర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా బత్తిని గౌరీ శంకర్ ను హన్మంతరావు శాలువాతో సన్మానించారు.
అనంతరం అయన మాట్లాడుతూ దశాబ్దాలు గా ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణి చేస్తూ నిస్వార్థంగా ప్రజలకు సేవలను అందిస్తున్న బత్తిన కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికీ అరుదైన పద్మశ్రీ పురస్కారాన్ని అందించాలని హన్మంత రావు డిమాండ్ చేశారు.కరోనా కారణంగా మూడేళ్ల తరువాత మళ్లీ ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణి తిరిగి ప్రారంభం కావడం ఆస్తమా రోగులకు సంతోషకరం అని అన్నారు.
Home
Unlabelled
బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి,,, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతించిన,,, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతా రావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: