కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణాకు జలకళ
రాష్ట్రానికి పెట్టుబడుల వరద
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లోని అల్మాస్ గూడ "పోచమ్మ కుంట చెరువు కట్టపై " జరిగిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆట పాటలతో, బతుకమ్మలు, బోనాలతో చెరువుల పండుగకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సాగిన ధూమ్ ధామ్ కార్యక్రమం అందర్నీ ఆకట్టుకొంది. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేది ఒక కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. మన ప్రాంతానికి కృష్ణ, గోదావరి నీళ్లు ఏ సందర్భంగా ఆయన రాకున్నా హెచ్ఎండిఏ ఏరియా పరిధిలో ఒక రింగ్ లాగా చుట్టూ ఒక ప్రత్యేక లైన్ వేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ను ఒక ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు దక్కుతుందన్నారు. సమర్థవంతమైన నాయకుని పాలనలో రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, శాంతి భద్రతలు,
పరిశ్రమల స్థాపనకు సులభంగా అనుమతులు ఉండటంతో మన రాష్టానికి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రూ. 1200 కోట్లతో నాళాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో, రూ. 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ. 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా రిజర్వాయర్లు కడుతున్నామని. గుర్రం గూడ, కూర్మల్ గూడ, జిల్లెల గూడ, బడంగ్ పేట్ ల వద్ద పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి ల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
Home
Unlabelled
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణాకు జలకళ ,,, రాష్ట్రానికి పెట్టుబడుల వరద ,,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: