కేసీఆర్ ఏ యజ్ఞం చేసిన యాగాలు చేసిన ప్రజల కోసమే
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
చేవెళ్ల మండలంలో కందావాడ గ్రామంలో మన ఊరు మన బడిలో భాగంగా 56.86 లక్షల వ్యయంతో చేపట్టిన ప్రైమరీ మరియు జిల్లా పరిషత్ పాఠశాల భవనాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయ లక్ష్మి రమణ రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, ,డి ఈ ఓ సుశీందర్ రావు, సర్పంచ్ అరుంధతి సాయి రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు....
ఈ నెల జూన్ 2 వ తేదీ నుండి రోజుకొక కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతూ వారికి ప్రభుత్వ చేసిన కార్యక్రమాలు వివరిస్తున్నట్లు తెలిపారు. నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా వర్షాలు కురావలని, రైతులకు మేలు జరగాలని కోరుకున్నానని ఇక్కడికి వచ్చే సరికి చినుకులు రావటం ఎంతో సంతోషాన్ని కల్గించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి అందరికి మంచి జరుగాలని దేవుణ్ణి కోరుకుంటూన్నన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ యజ్ఞం చేసిన యాగాలు చేసిన ప్రజల కోసమే అని వాటి ఫలాలు ప్రజలకు అందాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు.యదాద్రిని అధ్బుతంగా నిర్మించి,ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి నిధులుకేటాయిస్తూ,రామప్ప లాంటి దేవాలయాలకు యునెస్కో గుర్తింపు లభించేలా,సిరిసిల్ల వేములవాడ దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ,అన్ని దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు జరిగేలా కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ,అందరి మనోభావాలు కాపాడుతూ ముందుకు వెళ్తున్నారని అన్నారు.హిందువులు, ముస్లింలు,క్రైస్తవుల పండుగల సందర్భంగా అధికారికంగా బట్టలు పంపిణీ చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేజి టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా కేసీఆర్ వెయ్యికి పైగా గురుకులాలు స్థాపించగా,పాత వాటితో కలుపుకొని అందులో 6 లక్షల పై చిలుకు విద్యార్థులు చదువుతున్నారని ఒక్కో విద్యార్థి పై లక్ష 25 వేలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు కళ్యాణాలక్మితో పై చదువులకు యువతులు వెళుతున్నారని,మన ఊరు మన బడి లో భాగంగా 26 వేల పాఠశాలల్లో 7200 కోట్ల పై చిలుకు నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని,అనుభవజ్ఞులైన ఉపాద్యాయులు ఉన్నారని,విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడితే అద్భుతాలు సృష్టిస్తారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డ్రెస్సులు, వర్క్,నోట్ పుస్తకాలు అందించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు అందిస్తున్నట్లు,మధ్యాహ్న భోజనం వండే వారికి ఒక వేయి నుండి 3 వేలకు పెంచటం జరిగిందని అన్నారు.ఉదయం పూట ఇచ్చే రాగి జావాలో ప్రోటీన్లు,విటమిన్లు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరంలాగే పాలమూరును పూర్తి చేసి ఈ ప్రాంతాన్నీ సస్యశ్యామలం చేస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల రీడింగ్ కార్నార్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Home
Unlabelled
కేసీఆర్ ఏ యజ్ఞం చేసిన యాగాలు చేసిన ప్రజల కోసమే,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: