దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్

మంత్రి సబితా  ఇంద్రారెడ్డి

రన్ ఫర్ తెలంగాణ కు విశేష స్పందన.....

కదం తొక్కిన యువత....అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ పోలీస్ వారి ఆధ్వర్యములో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  తెలంగాణ 5కె రన్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి  వారిలో ఉత్సాహం నింపుతూ కదం తొక్కుతూ  ముందుకు కదిలారు. అంతకుముందు త్రివర్ణ రంగుల బెలూన్ లను గాలిలొ వదిలి,రన్ లో పాల్గొంటున్న వారిని అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...


తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ అన్నారు.సమాజంలో పోలీసులు పాత్ర చాలా గొప్పదని,శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయం అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులకు నూతన వాహనాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు.షీ టీం లు దేశానికి ఆదర్శం అయ్యాయన్నారు. సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.







 



బడిబాట కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి  కూడా హాజర్యారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: