జిల్లాలకు కూడా టీ వర్క్స్ విస్తరణ,,,ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో టీ వర్క్స్ ఉండగా.. త్వరలో టైర్-2 సిటీలకు కూడా దీనిని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లో టీ వర్క్స్ యూనిట్లు నెలకొల్పేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్దం చేసినట్లు ఐటీ, ఇండస్ట్రీయల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాయదుర్గంలో టీ వర్క్స్‌ని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఫ్యాక్స్‌కాన్ సీఈవో యంగ్ లియు ఈ ఏడాది మార్చి 2న మంత్రి కేటీఆర్ సమక్షంలో దీనిని ప్రారంభించారు. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4.79 ఎకరాల క్యాంపస్‌లో నిర్మించారు. దీనిని 2,40,00 చదరపు అడుగులకు విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే జిల్లాలకు కూడా ఐటీని విస్తరిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని టైర్ 2 నగరాల్లో కూడా టీ వర్క్స్ యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

జిల్లాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న టీ వర్క్స్‌లో లహపు, చెక్క పనితో పాటు సిరామిక్స్, 3డీ ప్రింటింగ్, లేజర్ కట్టింగ్, ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్, డిజిటర్ కట్టర్లు, ప్లాస్టిక్‌లు, మిశ్రమాల వాక్యూమ్ కాస్టింగ్, వాక్యూమ్ ఫార్మింగ్, హైస్పీడ్ CNC మ్యాచింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. జిల్లాలకు కూడా విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రాజెక్టులకు ఉపయోగపడుతుందని టీ వర్క్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఈ ఏడాది చివరికల్లా ఒక జిల్లాలో అయినా టీ వర్క్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. యూనివర్సిటీ లేదా ఇంజినీరింగ్ కాలేజీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తన్నారు. ఈ యూనిట్లలో విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రాజెక్టులకు సహాయం చేస్తారు. దీని వల్ల విద్యార్థులకు సులభంగా ఉంటుంది. ప్రతీసారి జిల్లాల నుంచి హైదరాబాద్ రావడం అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది. జిల్లాల్లో ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల ఆవిష్కరణలు స్థానిక సిబ్బంది సహాయపడతాయి. విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలంటే హైదరాబాద్ క్యాంపస్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది.

2024 కల్లా దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో పరికరాలను మరింతగా పెంచాలని చూస్తోంది. మార్చి 2023 వరకు వివిధ స్టార్టప్, ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ కంపెనీలకు వెయ్యి పార్ట్స్, 30 ప్రొడక్ట్స్‌ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జిల్లాలకు కూడా విస్తరించడం వల్ల కొత్త ఆవిష్కరణలు రావడంతో పాటు విద్యార్థులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: