ప్రపంచంతో తెలంగాణ విద్యార్థి పోటీపడేలా చేయడమే కేసీఆర్ ధ్యేయం
ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలలో అమెజాన్ సంస్థ వారి సహకారంతో కల్పించిన ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. బోనాలు, పోతారాజుల విన్యాసాలు, కోలాటాలు, డప్పులు వాయిస్తూ మంత్రితో పాటు అమెజాన్ ప్రతినిధులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి విదేశాల నుండి వచ్చిన అమెజాన్ ప్రతినిధులు నృత్యం చేసారు.
థింక్ బిగ్ స్పేస్- సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్,డైనింగ్ హాల్, కిచెన్ షెడ్,టాయిలెట్స్,15 స్పోర్ట్స్ కిట్స్, కంప్యూటర్ ల్యాబ్ కొసం 5 ల్యాబ్ టాప్ లు, సభా వేదిక, క్రీడా ప్రాంగణం ఆధునికరణ తదితర ఆధునిక సౌకర్యాలు కల్పించి పాఠశాలలను తీర్చిదిద్దిన అమెజాన్ సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. మన ఊరు మన బడి స్పూర్తితో పాఠశాలల అభివృద్ధికి అమెజాన్ సంస్థ ముందుకు రావటం అభినందనీయమని అన్నారు.
మన ఊరు మన బడి-మన బస్తీ మన బడిలో భాగంగా సకల హంగులతో,12 రకాల సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దిన 1000 పాఠశాలల లాగే నెదనురు పాఠశాలకు సకల హంగులు వచ్చాయని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు,టెక్స్ట్,మరియు నోట్ పుస్తకాలు, రాగి జావా,ఉపాద్యాయులకు ట్యాబ్ లు అందిస్తున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు 136 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, 190 కోట్లతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్,సంవత్సరానికి 35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారన్నారు.
12 లక్షల మంది విద్యార్థులకు 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్ , 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 20000 వేల మంది టీచర్స్ కు నేడు అందిస్తున్నట్లు తెలిపారు.మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123 పాఠశాలలో 3497.62 కోట్లతో పనులు చేపట్టి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దాదాపు 1000 పాఠశాలలను ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించినట్లు తెలిపారు.రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మన ఊరు మన బడి లో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు.
పెద్ద ఎత్తున విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.అన్ని సౌకర్యాలు కల్పిస్తే అధ్బుతమైన విజయాలు సాధిస్తారని,ఇప్పటికే మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణ పేరును చాటుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణా విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు.జిల్లాలో 6 కోట్లతో టెక్స్ట్ బుక్స్,10 కోట్ల 50 లక్షలతో 1.65లక్షల మంది రెండు జతల యూనిఫామ్ లు,5 కోట్ల విలువ చేసే 72 వేల మంది విద్యార్థులకు నోట్ బుక్స్,18.15 లక్షలతో రాగి జావా 1.6 కోట్ల విలువ చేసే 1058 ఉపాద్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేసారన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 ఏళ్ల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు.1200 కి పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు.దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు
,డిజిటల్ తరగతి గదులు కూడా ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా రాగి జావా అందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి గారు,అమెజాన్ గ్లోబల్ హెడ్ కార్నలియ రాబిన్సన్ గారు,డేటా సెంటర్ డైరెక్టర్ సాజి పి కె గారు, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు,ఎంపీపీ జ్యోతి గారు,సర్పంచ్ రామకృష్ణ రెడ్డి గారు,డి ఈ ఓ సుశీందర్ రావు గారు,ఉపాద్యాయులు, విద్యార్థులు,పేరెంట్స్,అమెజాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్రపంచంతో తెలంగాణ విద్యార్థి పోటీపడేలా చేయడమే కేసీఆర్ ధ్యేయం,,,, ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: