కార్పొరేట్ కన్నా మేటి మన ప్రభుత్వ బడులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ఇవి ప్రతిరూపాలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మన ఊరు మన బడి-మన బస్తీ మన బడిలో భాగంగా సకల హంగులతో,1 2 రకాల సౌకర్యాలతో  రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దిన 1000 పాఠశాలలను దశాబ్ది ఉత్సవాల విద్యా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రాెరెడ్డి ప్రారంభించారు. 


 తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జిల్లెల గూడ జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించి,తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు,టెక్స్ట్,మరియు నోట్ పుస్తకాలు, రాగి జావా,ఉపాద్యాయులకు ట్యాబ్ లు అందిస్తున్నామన్నారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యాదినోత్సవం సందర్బంగా ప్రజలకు,ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు 136 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, 190 కోట్లతో  ఉచితంగా టెక్స్ట్ బుక్స్,సంవత్సరానికి  35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారన్నారు.12 లక్షల మంది విద్యార్థులకు 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్ , 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 20000  వేల మంది టీచర్స్ కు నేడు అందిస్తున్నట్లు తెలిపారు.


మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123 పాఠశాలలో  3497.62 కోట్లతో పనులు చేపట్టి నేడు దాదాపు 1000 పాఠశాలలను ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించినట్లు తెలిపారు.పెద్ద ఎత్తున విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి  ధన్యవాదాలు తెలిపారు.

జిల్లాలో 6 కోట్లతో  టెక్స్ట్ బుక్స్,10 కోట్ల 50 లక్షలతో 1.65లక్షల మంది  రెండు జతల యూనిఫామ్ లు,5 కోట్ల విలువ చేసే 72 వేల మంది విద్యార్థులకు నోట్ బుక్స్,18.15 లక్షలతో రాగి జావా 1.6 కోట్ల విలువ చేసే 1058 ఉపాద్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేసారన్నారు. 


 ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు.1200 కి పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు,డిజిటల్ తరగతి గదులు కూడా ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. పేద,మధ్య తరగతి విద్యార్థుల విదేశీ కలను సాకారం చేసే దిశగా ఓవర్సీస్  స్కాలర్ షిప్ లు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి 10 జి పి ఏ సాధించిన విద్యార్థులను సన్మానించి 10 వేల చొప్పున ప్రోత్సాహకాలు అందించారు.ఉత్తమ ఉపాద్యాయులను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు.


పాఠశాల వద్ద పండుగ వాతావరణం

పాఠశాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది... విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడింది..పాఠశాలను చూసిన చాలా మంది ఇది ప్రభుత్వ పాఠశాలేన అని చర్చించుకున్నారు..మన బస్తీ-మన బడితో ఆధునిక హంగులు సంతరించుకున్న పాఠశాల లాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.


చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం తొలిమెట్టు కార్యక్రమం చేపట్టి సత్పలితాలు సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, డి ఈ ఓ సుశీందర్ రావు, ఉపాద్యాయులు, విద్యార్థులు, పేరెంర్స్ పాల్గొన్నారు. Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: